ISRO Jobs: ఇస్రోలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

ISRO Recruitment 2019 | ఆసక్తి గల అభ్యర్థులు VSSC అధికారిక వెబ్‌సైట్‌‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: July 29, 2019, 5:38 PM IST
ISRO Jobs: ఇస్రోలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
ISRO Jobs: ఇస్రోలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేయాలని కలలు కనేవారికి శుభవార్త. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో జేఆర్ఎఫ్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులున్నాయి. మొత్తం 20 ఖాళీలున్నాయి. అందులో 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF) పోస్టులు కాగా, మిగతా 10 రీసెర్చ్ అసోసియేట్ (RA) పోస్టులు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌కు చెందిన స్పేస్ ఫిజిక్స్ ల్యాబరేటరీలో ఈ ఉద్యోగుల్ని నియమించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు VSSC అధికారిక వెబ్‌సైట్‌‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌‌లో ఉంటాయి. ఇస్రోలో జేఆర్ఎఫ్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ISRO Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు



మొత్తం ఖాళీలు- 20
జూనియర్ రీసెర్చ్ ఫెలో- 10
రీసెర్చ్ అసోసియేట్-10
దరఖాస్తు ప్రారంభం: 16-07-2019
దరఖాస్తు ముగింపు: 30-07-2019 సాయంత్రం 5 గంటల వరకువిద్యార్హత: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, స్పేస్ ఫిజిక్స్, అట్మాస్ఫెరిక్ సైన్స్, మెటరాలజీ, స్పేస్ సైన్స్, ప్లానెటరీ సైన్సెస్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌లో ఎంఎస్సీ 60 శాతం మార్కులు లేదా 6.5/10 గ్రేడ్‌తో పాస్ కావాలి. ఆట్మోస్ఫెరిక్ సైన్స్, స్పేస్ సైన్స్, ప్లానెటరీ సైన్స్, అప్లైడ్ ఫిజిక్స్‌లో ఎంటెక్‌లో అన్ని సెమిస్టర్లలో 65% మార్కులతో పాస్ కావాలి. లేదా CGPA/CPI గ్రేడింగ్ 6.84/10 ఉండాలి. అభ్యర్థులకు CSIR-UGC NET, GATE, JAM, JEST క్వాలిఫికేషన్స్ కూడా తప్పనిసరి.
వయస్సు: 30-07-2019 నాటికి 28 ఏళ్లు. (ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు. వికలాంగులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయస్సులో సడలింపు)

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 అప్రెంటీస్ ఉద్యోగాలు

Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 445 ఉద్యోగాలు
Published by: Santhosh Kumar S
First published: July 29, 2019, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading