నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. టెక్నీషియన్ బీ, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మొత్తం 92 ఖాళీలున్నాయి. శ్రీహరికోటలోని షార్ కేంద్రంతో పాటు ఇతర సెంటర్లలో వీరిని నియమిస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య వేతనం ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000 వేతనం ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 92
కార్పెంటర్- 1
కెమికల్- 10
ఎలక్ట్రీషియన్- 10
ఎలక్ట్రో మెకానిక్- 14
ఫిట్టర్- 34
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 2
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్- 6
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్- 5
కెమికల్- 1
ఫిట్టర్- 1
బాయిలర్ అటెండెంట్- 2
ఎలక్ట్రో మెకానిక్- 1
మెకానికల్- 2
రీసెర్చ్ అసోసియేట్- 2
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 9
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 29 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- టెక్నీషియన్ బీ పోస్టుకు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ. రీసెర్చ్ అసోసియేట్‌కు మెటెరాలజీ, ఆట్మోస్ఫెరిక్ సైన్సెస్, ఓషియనోగ్రఫీ, ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
వేతనం- టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.21,700 నుంచి రూ.69,100. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000.
ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. టెక్నీషియన్ బీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రీసెర్చ్ అసోసియేట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Andhra Pradesh jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు... దరఖాస్తు లింక్ ఇదే
Indian Navy Jobs: 5 నోటిఫికేషన్స్... 1001 జాబ్స్... ఇండియన్ నేవీలో ఉద్యోగావకాశాలు
Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhrapradesh, AP News, CAREER, Exams, ISRO, Job notification, JOBS, Nellore, NOTIFICATION, Sriharikota