ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

ISRO Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ 2019 జూలై 29న ప్రారంభమైంది. 2019 ఆగస్ట్ 19 మధ్యాహ్నం 12 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలి.

news18-telugu
Updated: July 30, 2019, 11:56 AM IST
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
news18-telugu
Updated: July 30, 2019, 11:56 AM IST
భారత ప్రభుత్వానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఉద్యోగాలున్నాయి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బీ పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్-ISTRAC కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇంజనీర్లు, టెక్నీషియన్లకు నాలుగు పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2019 జూలై 29న ప్రారంభమైంది. 2019 ఆగస్ట్ 19 మధ్యాహ్నం 12 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.250. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులఎంపిక ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి ఇస్రో జారీ చేసిన నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ISRO Recruitment 2019: ఖాళీలు, విద్యార్హతల వివరాలివే...


ఎలక్ట్రానిక్స్-మెకానిక్- 1

ఎలక్ట్రికల్- 1
ఫిట్టర్- 1
ఎలక్ట్రానిక్స్- 1



విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్-మెకానిక్, ఎలక్ట్రికల్, ఫిట్టర్ పోస్టులకు ఎస్ఎస్‌సీ / ఎస్ఎస్ఎల్‌సీ / మెట్రిక్యులేషన్ + సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ / ఎన్‌టీసీ / ఎన్ఏసీ ఉండాలి. ఎలక్ట్రానిక్స్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాలో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్ కావాలి.
Loading...
వయస్సు: 18-35 ఏళ్లు
వేతనం: టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.21,700 వేతనం, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.44,900. హెచ్ఆర్ఏ, డీఏ, ట్రావెల్ అలవెన్సులు కూడా ఉంటాయి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

APSET: ఆగస్ట్ 5 నుంచి ఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ... అక్టోబర్ 20న పరీక్ష

IRCTC Jobs: ఐఆర్‌సీటీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
First published: July 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...