Home /News /jobs /

ISRO OFFERS 12 DAY FREE ONLINE COURSE ON BIODIVERSITY CONSERVATION CHECK DETAILS JNK GH

ISRO Free Course: జియో ఇన్ఫర్మేటిక్స్​పై ఇస్రో ఉచిత ఆన్​లైన్​ కోర్సు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇస్రోలో ఉచిత ఆన్‌లైన్ కోర్స్ (PC: ISRO)

ఇస్రోలో ఉచిత ఆన్‌లైన్ కోర్స్ (PC: ISRO)

ISRO Free Course: ఇండియన్​ స్పేస్​ రిసెర్చ్​ ఆర్గనైజేషన్​ (ఇస్రో) జియో ఇన్ఫర్మేటిక్స్​లో ఉచిత ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. ‘జియో ఇన్ఫర్మేటిక్స్​ ఫర్​ బయోడైవర్సిటీ కన్జర్వేషన్​ ప్లానింగ్’ పేరుతో దీన్ని అందిస్తోంది.

మారుతున్న టెక్నాలజీకి (Technology) అనుగుణంగా కొత్త కోర్సులను (New Course) అందిస్తున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. ప్రస్తుతం ఉన్న జాబ్​ మార్కెట్​ను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ప్రాక్టికల్​ ట్రైనింగ్ ఇస్తున్నాయి. తాజాగా ఇండియన్​ స్పేస్​ రిసెర్చ్​ ఆర్గనైజేషన్​ (ఇస్రో) (ISRO) జియో ఇన్ఫర్మేటిక్స్​లో ఉచిత ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. ‘జియో ఇన్ఫర్మేటిక్స్​ ఫర్​ బయోడైవర్సిటీ కన్జర్వేషన్​ ప్లానింగ్’ పేరుతో దీన్ని అందిస్తోంది. మొత్తం పన్నెండు రోజుల పాటు ఉండే ఈ కోర్సును డిసెంబర్ 6 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. విద్యార్థులకు, నిపుణులకు ఎంతగానో ఉపయోగపడే ఈ కోర్సుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. డెహ్రాడూన్​లోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్) భాగస్వామ్యంతో ఈ కోర్సును తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఐఐఆర్ఎస్ ఫ్యాకల్టీతో ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తోంది.

ఐఐఆర్​ఎస్ అనేది సహజ వనరులు, పర్యావరణం, విపత్తుల నిర్వహణ కోసం పనిచేస్తుంది. ఈ రంగాలకు ఉపయోగపడే రిమోట్​ సెన్సింగ్​, జియో ఇన్ఫర్మేటిక్స్​, జీఎన్​ఎస్​ఎస్​ టెక్నాలజీస్​పై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఇందులో భాగంగా ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఆన్​లైన్​ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పర్యావరణ అధ్యయనాలలో నిమగ్నమైన పరిశోధకులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.

కనీసం 70 శాతం హాజరును కొనసాగించి, కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ అందజేస్తామని ఇస్రో పేర్కొంది. ఈ కోర్సును ఐఐఆర్​ఎస్​ యూట్యూబ్​ ఛానల్​ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. కోర్సులో పాల్గొనేవారు జియోగ్రాఫిక్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్స్​ (జీఐఎస్​) అప్లికేషన్లు, ఫారెస్ట్​ బయోడైవర్సిటీ, 3డీ క్యారెక్టరైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్​తో ఫారెస్ట్ మానిటరింగ్​ వంటి కొత్త టెక్నాలజీల​పై పట్టు సాధిస్తారు.

Jobs in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కస్తూర్బా పాఠశాలల్లో 958 ఉద్యోగాలు


* కోర్సు కోసం ఎలా నమోదు చేసుకోవాలి?

1. ఐఐఆర్​ఎస్​ అధికారిక వెబ్‌సైట్‌ https://www.iirs.gov.in/ ను సందర్శించండి.

2. హోమ్‌పేజీలో, ‘ఐఐఆర్‌ఎస్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్’ కింద ఉన్న ‘ఎడ్యుశాట్’పై క్లిక్ చేయండి. తద్వారా ‘డిస్టెన్స్ లెర్నింగ్’ ట్యాబ్‌ ఓపెన్ అవుతుంది.



3. జియోఇన్ఫర్మేటిక్స్ ఫర్​ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్లానింగ్ కోర్సు ‘ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్’పై క్లిక్ చేయండి.



4. విద్యార్హతల వివరాలను నమోదు చేయండి.

5. అన్ని వివరాలతో ఫారమ్‌ను పూరించిన తర్వాత 'ప్రివ్యూ'పై క్లిక్ చేసి, వివరాలను మరోసారి తనిఖీ చేయండి.

6. 'సబ్​మిట్​'పై క్లిక్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Distance Education, ISRO, Online Education

తదుపరి వార్తలు