హోమ్ /వార్తలు /jobs /

ISRO online courses: ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందించనున్న ఇస్రో.. దరఖాస్తు ఎలా చేయాలంటే..

ISRO online courses: ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందించనున్న ఇస్రో.. దరఖాస్తు ఎలా చేయాలంటే..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థులకు, ఉద్యోగ నిపుణులకు మూడు కొత్త ఆన్ లైన్ కోర్సులను అందించాలని నిర్ణయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థులకు, ఉద్యోగ నిపుణులకు మూడు కొత్త ఆన్ లైన్ కోర్సులను అందించాలని నిర్ణయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థులకు, ఉద్యోగ నిపుణులకు మూడు కొత్త ఆన్ లైన్ కోర్సులను అందించాలని నిర్ణయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థులకు, ఉద్యోగ నిపుణులకు మూడు కొత్త ఆన్ లైన్ కోర్సులను అందించాలని నిర్ణయించింది. వారి నైపుణ్యాలకు పదునుపెట్టాలనే ఉద్దేశంతో ఉచితంగానే ఆన్ లైన్ కోర్సులను అందించనుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS) సైతం ఈ కార్యక్రమంలో భాగమైంది. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసినవారికి ప్రోగ్రాం చివర్లో సర్టిఫికేట్ కూడా అందజేస్తారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని కోర్సులను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఇస్రో, ఐఐఆర్ఎస్ కలిసి మూడు కోర్సులను ఆన్‌లైన్ మోడ్‌లో ఉచితంగా అందించనున్నాయి. మెషిన్ లెర్నింగ్ నుంచి డీప్ లెర్నింగ్ కోర్సు, ఓవర్ వ్యూ ఆఫ్ వెబ్ జీఐఎస్ టెక్నాలజీ, ఎర్త్ అబ్జర్వేషన్ ఫర్ కార్బన్ సైకిల్ స్టడీస్.. వంటి విభాగాల్లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు IIRS అధికారిక వెబ్ సైట్ iirs.gov.in ద్వారా అప్లికేషన్ సమర్పించాలి. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

  Amazon: అమెజాన్ నుంచి ఉచిత మెషిన్​ లెర్నింగ్​ కోర్సు

  Online Degree Courses: ఈ 38 యూనివర్సిటీల నుంచి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు చేయొచ్చు

  కోర్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

  ఇస్రో ఉచిత ఆన్ లైన్ కోర్సులు జూన్ 21 నుంచి ప్రారంభమవుతాయి. ఓవర్ వ్యూ ఆఫ్ వెబ్ జీఐఎస్ టెక్నాలజీ కోర్సు జూన్ 21 నుంచి జులై 2 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ లాంటి విషయాలపై పూర్తి పట్టు సాధించేలా తరగతులు ఉంటాయి. ఎర్త్ అబ్జర్వేషన్ ఫర్ కార్బన్ సైకిల్ స్టడీస్ కోర్సు జూన్ 21 నుంచి జూన్ 25 వరకు అందుబాటులో ఉంటుంది.}

  IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ ఉచిత ఆన్‌లైన్ కోర్సులు.. మెషిన్ లెర్నింగ్‌లో శిక్షణ

  లైవ్ వర్క్ షాప్‌ల ద్వారా లబ్ధి:

  అధికారిక వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అభ్యర్థులందరూ ఆన్ లైన్ కోర్సులకు హాజరుకావచ్చు. ఐఐఆర్ఎస్ డెహ్రాడూన్ పోర్టల్ ద్వారా ఆన్ లైవ్ క్లాసులు వినాలి. అభ్యర్థులు ఐఐఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వర్క్ షాపులో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఈ-క్లాస్ పోర్టల్ ద్వారా కోర్సు సెషన్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కోర్సులు పూర్తయిన తరువాత సర్టిఫికేట్ కూడా అందిస్తారు. యూట్యూబ్ సెషన్ కు హాజరయ్యే అభ్యర్థులు ఆప్‌లైన్‌లో హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది.

  First published:

  ఉత్తమ కథలు