హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ISRO Online Courses: రెండు ఉచిత ఆన్ లైన్ కోర్సులను ప్రారంభించిన ఇస్రో.. ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..

ISRO Online Courses: రెండు ఉచిత ఆన్ లైన్ కోర్సులను ప్రారంభించిన ఇస్రో.. ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) రెండు ఉచిత ఆన్ లైన్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (IIRS) ద్వారా జియో స్పేషియల్ మోడలింగ్, జియో స్పేషియల్ టెక్నాలజీపై రెండు ఉచిత ఆన్ లైన్ కోర్సులను అందిస్తోంది.

ఇంకా చదవండి ...

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) రెండు ఉచిత ఆన్ లైన్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (IIRS) ద్వారా జియో స్పేషియల్ మోడలింగ్, జియో స్పేషియల్ టెక్నాలజీపై రెండు ఉచిత ఆన్ లైన్ కోర్సులను అందిస్తోంది. విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఈ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రాలను కూడా ఇస్రో అందజేయనుంది. ఉచిత ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సులు పొందడానికి జియో స్పేషియల్ మోడలింగ్ ఫర్ వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్, జియో స్పేషియల్ టెక్నాలజీ ఫర్ హైడ్రోలాజికల్ మోడలింగ్ కోర్సులను అందిస్తోంది. నేల, నీటి సంరక్షణ రంగాల గురించి తెలుసుకోవడానికి ఇస్రో ఈ రెండు ఆన్ లైన్ కోర్సులను ప్రవేశపెట్టింది.

జియో స్పేషియల్ మోడలింగ్ ఫర్ వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్..

వాటర్ షెడ్ నిర్వహణను అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, జీఐఎస్ సహా జియో స్పేషియల్ టెక్నాలజీ వంటివి శక్తిమంతమైన సాధనాలుగా అవతరించాయి. 2021 ఆగస్టు 2 నుంచి 6 వరకు ఈ కోర్సులను నిర్వహించనున్నారు.

విద్యార్థులు ఏం నేర్చుకుంటారు..

-వాటర్ షెడ్ నిర్వహణలో ఆర్ఎస్, జీఐఎస్ అప్లికేషన్లు

-వాటర్ క్యారెక్టరైజేషన్ కోసం డిజిటల్ టెర్రైన్ విశ్లేషణ

-వాటర్ షెడ్ లో నేల కోత అంచనా కోసం జియో స్పేషియల్ మోడలింగ్

-భూ వినియోగ ప్రణాళిక, నేల, నీరు సంరక్షణ చర్యలు

-ఆర్ఎస్, జీఐఎస్ ఉపయోగించి వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ

అర్హత..

-సైన్స్/అగ్రికల్చరల్ సైన్స్/అగ్రికల్చరల్ లేదా సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా ఉండాలి

-రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ విషయాల్లో బేసిక్ అవగాహన కలిగి ఉండాలి.

ప్రస్తుతం పరిమితమైన సీట్లు ఉండటం వల్ల ఎవరు ముందుగా వస్తారో వారికే ప్రాధాన్యత ఇస్తారు

ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..

-కోర్సు అప్డేట్లు, ఇతర వివరాలు URL- http://www.iirs.gov.in/Edusat-News/ లో ​​లభిస్తాయి.

-పాల్గొనే వారందరూ పైన పేర్కొన్న వెబ్ పేజీలో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పేజీ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

తరగతులకు ఎలా హాజరు కావాలి..

-లెక్చర్ స్లైడ్స్, వీడియో లెక్చర్లు, స్టడీ మెటీరియల్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్, డెమాన్‌స్ట్రేషన్లు తదితర మధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. వీడియో లెక్చర్లు ఈ-క్లాస్ (https://www.eclass.iirs.gov.in/login) లో కూడా అప్‌లోడ్ చేస్తారు.

-ఐఐఆర్ఎస్ డెహ్రడూన్ పోర్టల్ ద్వారా వ్యక్తులు ఏదైనా వెబ్ బ్రౌజర్ ద్వారా ప్రత్యక్షంగా కోర్సుకు హాజరుకావచ్చు.

-ఈ-క్లాస్ (https://www.eclass.iirs.gov.in/login) వెబ్‌సైట్‌లో కూడా వీటిని అప్‌లోడ్ చేస్తారు.

-వర్క్‌షాప్ కంటెంట్ ఈ-క్లాస్ పోర్టల్‌ https://www.youtube.com/user/edusat2004లో 24 గంటల తర్వాత ఆఫ్‌లైన్‌లో లభిస్తుంది.

సర్టిఫికెట్ ఎలా పొందాలి..

-పాల్గొనేవారు కోర్సు 70 శాతం సెషన్లు ఈ-క్లాస్ పోర్టల్ ద్వారా ప్రత్యక్షంగా హాజరు కావాలి.

-ఐఐఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కోర్సు సెషన్లకు హాజరయ్యే వారు 24 గంటల తర్వాత అందుబాటులో ఉన్న ఆఫ్ లైన్ సెషన్ ద్వారా హాజరును గుర్తించాలి.

* జియో స్పేషియల్ టెక్నాలజీ ఫర్ హైడ్రోలాజికల్ మోడలింగ్ కోర్సులు..

హైడ్రోలాజికల్ పారామితులు, నీటి కదలిక లేదా డిమాండ్ వినియోగ దృశ్యాలను అంచనా వేయడానికి హైడ్రోలాజికల్ మోడలింగ్ ఓ ప్రభావవంతమైన, అవసరమైన సాధనం. ఈ కోర్సు 2021 జులై 19 నుంచి జులై 30 వరకు ఉంటుంది.

విద్యార్థులు ఏం నేర్చుకుంటారు..

-జియోస్పేషియల్ టెక్నాలజీ అప్లికెంట్స్ ఫర్ వాటర్ రిసోర్సెస్: ఓవర్ వ్యూ

-టైప్ ఆఫ్ హైడ్రోలాజికల్ మోడల్స్, స్పేషియల్, హైడ్రోలాజికల్ మోడలింగ్ కోసం నాన్ స్పేషియల్ డేటా ఇన్ పుట్లు

-డిజిటల్ ఎలివేషన్ మోడల్

-రెయిన్ ఫాల్-రన్ ఆఫ్ మోడలింగ్

-స్నో/గేరియల్ మెల్ట్ రనాఫ్ మోడలింగ్

-నేల కోత, అవక్షేప దిగుబడి మోడలింగ్

-హైడ్రోలాజికల్ మోడలింగ్ ఉపయోగించి వరద అంచనా

- 1డీ హైడ్రోడైనమిక్ రివర్ ఫ్లో మోడలింగ్ ఉపయోగించి రివర్ ఫ్లో

అర్హత..

-సైన్స్/టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ

-రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ విషయాల్లో బేసిక్ అవగాహన కలిగి ఉండాలి.

ప్రస్తుతం పరిమితమైన సీట్లు ఉండటం వల్ల ఎవరు ముందుగా వస్తారో వారికే ప్రాధాన్యత ఇస్తారు.

ఎలా నమోదు చేసుకోవాలి..

ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..

-కోర్సు అప్డేట్లు, ఇతర వివరాలు URL- http://www.iirs.gov.in/Edusat-News/ లో ​​లభిస్తాయి.

-పాల్గొనే వారందరూ పైన పేర్కొన్న వెబ్ పేజీలో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పేజీ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

First published:

Tags: Online Education

ఉత్తమ కథలు