ISRO Courses : గ్రాడ్యుయేట్‌ల‌కు గుడ్ న్యూస్‌.. ఇస్రోలో రిమోట్‌సెన్సింగ్‌పై రెండు నెల‌ల‌ కోర్సుకు ద‌ర‌ఖాస్తుల‌ ఆహ్వానం

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (Indian Institute of Remote Sensing) ద్వారా నిర్వహించబడే రిమోట్ సెన్సింగ్ ఇమేజ్ అనాలిసిస్ (Remote Sensing and Image Analysis) మీద‌ ఇస్రో రెండు నెలల ఆఫ్‌లైన్ కోర్సుల‌ను విద్యార్థుల‌కు అందించ‌నుంది. ఈ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 12 నవంబర్ 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

 • Share this:
  డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (Indian Institute of Remote Sensing) ద్వారా నిర్వహించబడే రిమోట్ సెన్సింగ్ ఇమేజ్ అనాలిసిస్ (Remote Sensing and Image Analysis) మీద‌ ఇస్రో (ISRO) రెండు నెలల ఆఫ్‌లైన్ కోర్సుల‌ను విద్యార్థుల‌కు అందించ‌నుంది. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. దేశీయ అవ‌స‌రాలు.. అంత‌రిక్ష ప‌రిజ్ఞానం (Space Technology)పై విద్యార్థులకు నైపుణ్యం క‌ల్పించ‌డం ల‌క్ష్యంగా ఇస్రో ఈ కోర్సును నిర్వ‌హిస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ (Notification)ను ఐఐఆర్ఎస్ (IIRS) విడుద‌ల చేసింది. ఈ కోర్సుకు ద‌ర‌ఖాస్తు చేసుకొన్న వారికి రిమోట్ సెన్సింగ్ రంగంలో పనిచేసే ప‌రిజ్ఞానం అనుభ‌వం అందించనున్నారు. ఈ కోర్సుకు 20 మంది అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఎంపికైన వారికి సింగిల్ లేదా డ‌బుల్ ఆక్యుపెన్సీ (Occupancy) కి కేవ‌లం నామ మాత్ర‌పు చార్జీలతో అందిస్తున్నారు. అభ్య‌ర్థుల‌కు ఉండ‌డానికి వ‌స‌తి అందిస్తుంది.

  కోర్సు అభ్య‌సించిన వారికి జియోస్పేషియల్ టూల్స్ అండ్‌ టెక్నాలజీల (Geospatial tools and Technologies) సిద్ధాంతం, వాటి అభ్యాసంపై మంచి పని పరిజ్ఞానాన్ని అందింస్తారు. ఇస్రో కోర్సు కోసం ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుసరించే ప్రభుత్వ సంస్థలచే నామినేట్ చేయబడిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు అధికారికి వెబ్‌సైట్ https://admissions.iirs.gov.in/ ను సంద‌ర్శించాలి ఉంటుంది.

  Wipro Recruitment : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ ఏడాది విప్రోలో 17,000 కొత్త ఉద్యోగాలు


  ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..
  - ఈ కోర్సు చేసేందుకు సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు.
  - ద‌ర‌ఖాస్తు దారు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
  - ఎంపికైన అభ్య‌ర్థులు కోర్సు ఫీజు రూ. 20,000 చెల్లించాల్సి ఉంటుంది.  ముఖ్య‌మైన స‌మాచారం. .  కోర్సు రిమోట్ సెన్సింగ్ అండ్‌ ఇమేజ్ అనాల‌సిస్‌
  ద‌ర‌ఖాస్తు ప్రారంభం ఆగ‌స్టు 2, 2021
  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 12, 2021
  ఫ‌లితాల విడుద‌ల డిసెంబ‌ర్ 3, 2021
  కోర్సు ప్రారంభం జ‌న‌వ‌రి 10, 2022
  కోర్సు ముగింపు మార్చ్ 4, 2022

  కోర్సులో నేర్పించే అంశాలు..
  ఇస్రో ఎంపికైన అభ్య‌ర్థుల‌కు రిమోట్‌సైన్సింగ్ ప్రాథ‌మిక అవ‌గాహ‌న నుంచి ప్లికేషన్ డొమైన్‌లలోకి స్పేస్ టెక్నాలజీ అండ్‌ జియోస్పేషియల్ సైన్సెస్‌ని ఉపయోగించడం వంటి అంశాల‌పై శిక్ష‌ణ ఇస్తారు. ముఖ్యంగా మూడు అంశాల‌పై నైపుణ్యాన్ని అందిస్తారు.

  TCS Careers : "టీసీఎస్ పిలుస్తోంది".. నిరుద్యోగుల‌కు ఉచిత శిక్ష‌ణ‌.. ఉపాధి అవ‌కాశాలు


  - బేసిక్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ మరియు ఫోటోగ్రామెట్రీ (Basics of remote sensing and photogrammetry)
  - డిజిటల్ ఇమేజ్ అనాలసిస్ (Digital image analysis)
  - థిమెటిక్ లెక్చ‌ర్స్ అండ్ ప్రాజెక్ట్ వ‌ర్క్ (Thematic lectures and project work)

  ద‌ర‌ఖాస్తు విధానం. .
  - ఆసక్తి గల పాల్గొనేవారు అధికారిక వెబ్‌సైట్ https://admissions.iirs.gov.in/ ను సంద‌ర్శించాలి.
  - ముందుగా కోర్సు విధానాన్ని చ‌ద‌వాలి. (కోర్సు బ్రౌచ‌ర్ కోసం క్లిక్ చేయాలి)
  - అప్లికేష‌న్ ఫామ్ పూర్తిగా నింపాలి.
  - అనంత‌రం ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి.
  - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 12 నవంబర్ 2021 న 5:30 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
  Published by:Sharath Chandra
  First published: