హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ISRO Free Online Course: జియో ఇన్ఫర్మేటిక్స్‌పై ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు.. అభ్యర్థులకు నేర్పించే అంశాలివే..

ISRO Free Online Course: జియో ఇన్ఫర్మేటిక్స్‌పై ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు.. అభ్యర్థులకు నేర్పించే అంశాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కోర్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పర్యావరణ అధ్యయనాల్లో నిమగ్నమైన పరిశోధకులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్సులో పాల్గొనే పార్టిసిపెంట్లకు ఈ-క్లాస్ పోర్టల్ ద్వారా 70 శాతం హాజరు ఉంటే.. వారు ఇస్రో సర్టిఫికేట్ అందుకుంటారు.

ఇంకా చదవండి ...

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) విద్యార్థులు, నిపుణులకు తీపి కబురు అందిస్తూ ఒక ఫ్రీ ఆన్‌లైన్ కోర్సును (ISRO Free Online Course) ప్రకటించింది. "జియోఇన్ఫర్మేటిక్స్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్లానింగ్" అనే ఆన్‌లైన్ కోర్సు (Online course)ను ఉచితంగా అందిస్తున్నామని ఇస్రో (ISRO) తెలిపింది. ఈ పన్నెండు రోజుల కోర్సును డిసెంబర్ 6 నుంచి 17 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఆసక్తి గల అభ్యర్థుల (candidates) నుంచి ప్రస్తుతం దరఖాస్తులను (Applications) ఆహ్వానిస్తున్నామని పేర్కొంది.

సహజ వనరులు, పర్యావరణ, విపత్తు నిర్వహణ కోసం..

శిక్షణ, విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS) ద్వారా ఈ కోర్సు (ISRO Free Online Course)ను ఇస్రో అందుబాటులోకి తెస్తోంది. ఐఐఆర్ఎస్ అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) కు కేంద్రంగా ఉంది. ఐఐఆర్ఎస్ అనేది సహజ వనరులు, పర్యావరణ, విపత్తు నిర్వహణ కోసం రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, జీఎన్ఎస్ఎస్ (GNSS) టెక్నాలజీలో శిక్షణ పొందిన నిపుణులను (experts) అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన ఒక శిక్షణ, విద్యా సంస్థ. ఇస్రో ఆన్‌లైన్ కోర్సులో ఏం అంశాలు నేర్చుకోవచ్చు? ఈ కోర్సు ఎవరి కోసం ఉద్దేశించింది? లాంటి వివరాలు చూద్దాం.

ఈ కోర్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పర్యావరణ అధ్యయనాల్లో నిమగ్నమైన పరిశోధకులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్సులో పాల్గొనే పార్టిసిపెంట్లకు ఈ-క్లాస్ పోర్టల్ ద్వారా 70 శాతం హాజరు ఉంటే.. వారు ఇస్రో సర్టిఫికేట్ (ISRO Certificate) అందుకుంటారు. ఐఐఆర్ఎస్ యూట్యూబ్ (IIRS YouTube) ఛానెల్ ద్వారా కోర్సు సెషన్‌లకు హాజరయ్యే పార్టిసిపెంట్లు 24 గంటల తర్వాత అందుబాటులో ఉంచే ఆఫ్‌లైన్ సెషన్ ద్వారా తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది.

* జియోఇన్ఫర్మేటిక్స్‌పై ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు ఏమి కవర్ చేస్తుంది?

బయోడైవర్సిటీ ఎలిమెంట్‌లను పర్యవేక్షించడానికి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్‌ (Remote Sensing Application‌)లను ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ గా ఎలా ఉపయోగిస్తున్నారో పార్టిసిపెంట్లకు అర్థమయ్యేలా తెలియజేయడమే ఈ కోర్సులక్ష్యం. ఈ కోర్సు (ISRO Free Online Course) లో ఈ కింది అంశాలను కూడా కవర్ చేస్తారు.

- జీవవైవిధ్య పరిరక్షణ ప్రణాళికలో GIS అప్లికేషన్లు.

-మెషిన్ లెర్నింగ్ తో వృక్షసంపద స్కేల్ మ్యాపింగ్.

- 3డీ క్యారెక్టరైజేషన్ లో అటవీ జీవవైవిధ్యం చూపించడం.

- జియోఇన్ఫర్మేటిక్స్ ఉపయోగించి ఫంక్షనల్ బయోడైవర్సిటీ అంచనా.

- అటవీ పర్యవేక్షణ కోసం జియోఇన్ఫర్మేటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగించి వన్యప్రాణుల నివాస అనుకూలత అంచనా.

- బయోడైవర్సిటీ ఇన్ఫర్మేటిక్స్, వైల్డ్ లైఫ్ టెలిమెట్రీ.

* కోర్సు గురించి ముఖ్యమైన వివరాలు

ఈ కోర్సును 2021, డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఈ-క్లాస్ పోర్టల్, IIRS YouTube ఛానెల్‌లో నిర్వహిస్తోంది ఇస్రో. లెక్చర్ స్లైడ్‌లు, వీడియో రికార్డ్ చేసిన లెక్చర్‌లు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్, ప్రజెంటేషన్ల హ్యాండ్‌అవుట్‌లు వంటి అన్ని కోర్సు స్టడీ మెటీరియల్‌లు ఈ-క్లాస్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల విద్యార్థులు, నిపుణులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు. లేదా https://www.iirs.gov.in/iirs/sites/default/files/pdf/2021/Course_Brochure_93course.pdf ఈ లింక్ పై క్లిక్ చేసి వార్త గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: ISRO, New course, Online classes

ఉత్తమ కథలు