Home /News /jobs /

ISRO AGREEMENT WITH THE SKILL DEVELOPMENT DEPARTMENT LAUNCH OF TECHNICAL TRAINING PROGRAM FOR THEM GH VB

ISRO-Skill Development: స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో ఇస్రో ఒప్పందం.. వారికోసం ప్రత్యేక ప్రోగ్రామ్‌ ప్రారంభం..

ఇస్రోలో  (PC: ISRO)

ఇస్రోలో (PC: ISRO)

టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)తో నైపుణ్యాభివృద్ధి- వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE) ఓ అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.

యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం(Central Government) అనేక చర్యలు చేపట్టింది. వారిలో నైపుణ్యాలను పెంపొందించడం కోసం పలు సాంకేతిక శిక్షణ సంస్థలతో ఒప్పందాలను చేసుకుంది. తాజాగా టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను(Technical Training Programme) ప్రారంభించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)తో నైపుణ్యాభివృద్ధి- వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE) ఓ అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఎంఎస్‌డీఈ(MSDE) కార్యదర్శి రాజేష్ అగర్వాల్, అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

Imran Khan : పాక్ లో కొత్త పరిణామం..ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఐదేళ్ల కాలంలో 4000 మందికి పైగా ఇస్రో సాంకేతిక ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని స్పేస్ డొమైన్‌లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ISRO సాంకేతిక సిబ్బందికి నైపుణ్యాలు, సామర్థ్యాల పెంపుదల కోసం శిక్షణను అందించడానికి ఓ స్వల్పకాలిక కోర్సుల కోసం అధికారిక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దేశ వ్యాప్తంగా ఉన్న MSDE ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (NSTI)లో శిక్షణ ఇవ్వనున్నారు.

ఎంఎస్‌డీఈ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం సాంకేతికత, డిజిటలైజేషన్ వైపు కదులుతున్న తరుణంలో ఆయా రంగాల్లోని మన సాంకేతిక సిబ్బందికి స్కిల్స్ పెంపొందించడం అత్యవసరమన్నారు. ఇస్రోలోని సాంకేతిక నిపుణులకు నైపుణ్యం అందించడంతో ఆ దిశగా ఒక అడుగు పడిందన్నారు. గత పదేళ్లుగా స్పేస్ డొమైన్‌ ప్రాధాన్యత సంతరించుకోవడానికి ఇస్రో గేమ్ ఛేంజర్‌లా పనిచేస్తుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు సాంకేతిక సిబ్బందిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి పెంపొందించుకోవడానికి దోహదపడుతుందన్నారు. తద్వారా అంతరిక్ష రంగంలో భారతదేశ ప్రతిష్ట పెరుగుతుందని.... దేశానికి అంతరిక్షం కొత్త భవిష్యత్తును అందించడం కోసం ఇస్రో‌కు సహాయ సహకారాలు అందిస్తామని అగర్వాల్ అన్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (DOS) ఆధ్వర్యంలో ఇస్రో కేంద్రాలు, యూనిట్లలో పనిచేస్తున్న వివిధ సాంకేతిక సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న MSDE అత్యాధునిక శిక్షణా సంస్థల సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. తాజా పరిశ్రమ పోకడలు, అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి నిర్దిష్ట విభాగాలలో శిక్షణను అందించనున్నారు. అవగాహన ఒప్పందం ప్రకారం.. ప్రోగ్రామ్ ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కోసం వివరణాత్మక శిక్షణా క్యాలెండర్, శిక్షణా పాఠ్యాంశాలు, సిలబస్‌ను సిద్ధం చేయడానికి MSDE అనుబంధ సంస్థ NSTIతో కలిసి ఇస్రో పనిచేయనుంది. శిక్షణలో పాల్గొనేవారికి ఇస్రో ట్రైనీ కిట్‌లను అందజేస్తుంది.

IT Jobs: ఫ్రెషర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్... ఎంట్రీ సాలరీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు

జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ(NSTI)ల్లో శిక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆఫీస్ (CBPO)తో MSDE సంప్రదించనుంది. ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, తరగతి గదులు, నమూనాలు, ఇతర శిక్షణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం MSDE పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, ISRO, Programs, Skills, Technical

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు