Home /News /jobs /

ISI KOLKATA RECRUITMENT 2022 APPLY FOR 3 PROJECT LINKED PERSON POSTS CHECK ELIGIBILITY AND APPLICATION PROCESS VB

PG Qualification Jobs: మాస్టర్ డిగ్రీ అర్హతతో.. ఇంటర్వ్యూ ద్వారా పలు ఉద్యోగాల భర్తీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతా (ISI Kolkatta)పశ్చిమ బెంగాల్‌లోని ప్రాజెక్ట్ లింక్డ్ పర్సన్ పోస్ట్‌కునోటిఫికేషన్ విడుదల అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతా (ISI Kolkata)పశ్చిమ బెంగాల్‌లోని ప్రాజెక్ట్ లింక్డ్ పర్సన్ పోస్ట్‌కునోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను isical.ac.inలో పొందుపరిచారు. ఆసక్తి గల అభ్యర్థులు 22-Jul-2022 తారీఖు లోపు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే..  కోల్‌కతాలోని(Kolkata) భారత ప్రభుత్వ గణాంకాలు, పథకాల నిర్వహణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(Indian Statistical Institute).. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్‌ లింక్డ్‌ పర్సన్స్‌(Project Linked Persons) పోస్టులను భర్తీ చేయనుంది. సెలెక్ట్(Select) అయిన అభ్యర్థి 31 మార్చి 2023 వరకు కొనసాగుతారు. తదుపరి సదరు అభ్యర్థి ఇదే ఉద్యోగంలో కొనసాగాలా లేలదా అనేది కంపెనీ(Company) నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.

ESIC Recruitment 2022: హైదరాబాద్ ESICలో ఉద్యోగాలు.. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. 


వయోపరిమితి: ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థి గరిష్ట వయస్సు 01-07-2022 నాటికి 35 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్స్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వం నియమాల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.



మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: స్టాటిస్టిక్స్‌/డేటా సైన్స్‌/ఎకనామెట్రిక్స్‌/పాపులేషన్‌ స్టడీస్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన అనుభవం ఉండాలి.

జీతం: నెలకి రూ.25,000 నుంచి రూ.45,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము: లేదు.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 08-07-2022
ఇ-మెయిల్ పంపడానికి చివరి తేదీ: 22-జూలై-2022

అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును నిర్ణీత ఫార్మాట్‌లో అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లతో పాటు 22-Jul-2022లోపు లేదా అంతకు ముందు ఇ-మెయిల్ ID sosu@isical.ac.in కి పంపవచ్చు.

అధికారిక నోటిఫికేషన్ pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్ isical.ac.in ను సందర్శించవచ్చు. దరఖాస్తుల చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీని వ్యక్తిగత ఈ మెయిల్ ఐడీకి పంపిస్తారు. దాని నుంచి వర్చువల్ గా ఇంటర్వ్యూ జరగుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central jobs, JOBS, Kolkatta

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు