హోమ్ /వార్తలు /jobs /

ISB Online Course: ఐఎస్​బీలో డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్‌ ఆన్‌లైన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హత, ఇతర పూర్తి వివరాలివే

ISB Online Course: ఐఎస్​బీలో డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్‌ ఆన్‌లైన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హత, ఇతర పూర్తి వివరాలివే

ప్రీమియం బిజినెస్​ స్కూల్​గా పేరొందిన హైదరాబాద్​లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ఓ కొత్త ఆన్​లైన్​ కోర్సును ప్రవేశపెట్టింది. డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ (DMA) ప్రోగ్రామ్‌ నాలుగో బ్యాచ్​కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  మారుతున్న జాబ్​ మార్కెట్​కు (Job Market) అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు. ఈ క్రమంలోనే ప్రీమియం బిజినెస్​ స్కూల్​గా పేరొందిన హైదరాబాద్​లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ఓ కొత్త ఆన్​లైన్​ కోర్సును ప్రవేశపెట్టింది. డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ (DMA) ప్రోగ్రామ్‌ నాలుగో బ్యాచ్​కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్​ను ఎమెరిటస్ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో ఆఫర్​ చేస్తుంది. ఈ కోర్సు ఫిబ్రవరి 14న ప్రారంభమవుతుంది. 12 వారాల పాటు కొనసాగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ ప్రోగ్రామ్​ను 5 నుంచి 15 సంవత్సరాల మధ్య పని అనుభవం​ గల మధ్య స్థాయి, సీనియర్ స్థాయి నిపుణుల కోసం ప్రత్యేకంగా డిజైన్​ చేసింది. ఏదైనా స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/పీజీడీఎం పూర్తి చేయని వారు సైతం డీఎంఏ కోర్సులో చేరవచ్చని ఐఎస్​బీ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

  డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ (డీఎంఏ) ప్రోగ్రామ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్‌లోని అనేక ముఖ్యమైన అంశాలు, మాడ్యూల్స్​ను నేర్చుకోవచ్చు. ఆప్టిమైజేషన్లు. రికమండేషన్స్​ చేయడంలో ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసిన వారు ఐఎస్​బీ ఎగ్జిక్యూటివ్ నెట్‌వర్క్‌లో భాగం అవుతారు. అంతేకాదు, ఐఎస్​బీ ఎగ్జిక్యూటివ్ అలుమ్ని గ్రూప్‌లో చేరే అవకాశం లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్​ను ఐఎస్​బీ ఫ్యాకల్టీ నిర్వహిస్తున్నారు. నిపుణులైన ఫ్యాకల్టీ చేత ఆన్​లైన్​ క్లాసులుంటాయి. కాగా, ఐఎస్​బీ 2021 ఏప్రిల్​లో డిజిటల్​ మార్కెటింగ్​ అనలిటిక్స్​ (బీఎంఏ) మొదటి బ్యాచ్​ను ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం మూడు బ్యాచ్​లు పూర్తయ్యాయి. ఈ మూడు బ్యాచ్‌ల ద్వారా 824 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.

  NPTEL: నిరుద్యోగులకు ​ గుడ్​న్యూస్.. ఐటీ సెక్టార్​లో ఉద్యోగమే లక్ష్యంగా.. కోర్సు ప్రారంభం.. వివరాలిలా..

  డిజిటల్​ మార్కెటింగ్​లో పెరుగుతున్న అవకాశాలు..

  గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, 2025 నాటికి భారతదేశంలో డిజిటల్ మార్కెటింగ్ పరిధి USD 160 బిలియన్లను చేరుకుంటుంది. హాట్​స్యూట్​ 2021 ప్రకారం, 44.8 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు బ్రాండ్ సమాచారం కోసం సోషల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారు. నేటి ఆన్‌లైన్ వ్యాపార వాతావరణంలో డిజిటల్ మీడియా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అందుకే, డిజిటల్​ మార్కెటింగ్​ నిపుణులకు భారీ డిమాండ్​ నెలకొంది.

  Microsoft Jobs: గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్​లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

  ఈ ప్రోగ్రామ్​ గురించి APAC, ఎమెరిటస్ సీఈవో మోహన్ కన్నెగల్ మాట్లాడుతూ, “గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. సాంకేతిక ఆధారిత పురోగతితో కార్పొరేట్​ కంపెనీలు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌ను తమ బ్రాండ్​ ప్రయోషన్​ కోసం బాగా ఉపయోగించుకుంటున్నాయి. తద్వారా టార్గెట్​​ ఆడియన్స్​ను సులభంగా చేరుకుంటూ మార్కెట్​ను విస్తరించుకుంటున్నాయి. తద్వారా, సాంప్రదాయ మార్కెటింగ్ విధానాలకు స్వస్తి పలికి డిజిటల్ మార్కెటింగ్‌ వైపు కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.

  First published:

  ఉత్తమ కథలు