మారుతున్న జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. తాజాగా హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Indian School of Business) కొత్త కోర్సును ప్రారంభించింది. విద్యార్థులు భవిష్యత్తులో సీఎఫ్ఓలు (CFO)గా మారడానికి ఈ ప్రత్యేక కోర్సును సిద్ధం చేసింది. 'ఫ్యూచర్-రెడీ సీఎఫ్ఓ' అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ను అందించడానికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ టాలెంట్‌స్ప్రింట్ (Talent Sprint)తో జతకట్టింది. భవిష్యత్తులో ఫైనాన్స్ రంగం (Finance Sector)లో నిపుణుల అవసరాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా డిజిటల్ వేదిక (Digital Platform)గా ఈ కోర్సును అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను హైబ్రిడ్ మోడల్ (Hybride Model)లో రూపొందించారు. ప్రపంచంలో నాయకత్వం వహించగల ఫైనాన్స్ నిపుణుల అవసరాలను తీర్చేందుకు ఈ కోర్పు ఉపయోగపడుతుంది.
Jobs In Telangana: వరంగల్ రీజియన్ పరిధిలో 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
మొత్తం ఆరు నెలల వ్యవధి గల ఈ కోర్సు (Six Month Cours)ను ప్రొఫెసర్ భగవాన్ చౌదరి నేతృత్వంలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ ఫ్యాకల్టీ బోధిస్తారు. జనవరి 2022న హైదరాబాద్‌లోని ఐఎస్బీ (ISB) క్యాంపస్‌లో ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. మొదటి బ్యాచ్‌లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ని www.isb.talentsprint.com/cfo/ లో సబ్మిట్ చేయాలి.
ఫైనాన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది..
ఈ ప్రోగ్రాం రేపటి కొత్త తరంలో ఫైనాన్స్ నాయకత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని బిజినెస్ స్కూల్ (Bussiness School) వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రోగ్రామ్ ఫైనాన్స్ రంగంలో అనేక క్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తుందని విద్యా వేదికలు చెబుతున్నారు.
WhatsApp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు.. అవేంటి? ఎలా పనిచేస్తాయి? ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
ఈ కార్యక్రమం రాబోయే కొద్ది సంవత్సరాలలో C -సూట్ పాత్రలను పోషించాలనుకునే నవ తరం ఫైనాన్స్ లీడర్లను తయారు చేస్తుందని చెప్పారు. ప్రస్తుత ఔత్సాహిక సీఎఫ్ఓలను లక్ష్యంగా చేసుకుని ఈ కోర్సును రూపొందించినట్లు ఆయన తెలిపారు.
దీనిపై టాలెంట్‌స్ప్రింట్ ఎండీ, సీఈవో డాక్టర్ శాంతాను పాల్ మాట్లాడుతూ, “ఐఎస్బీలోని సెంటర్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్‌తో కలిసి దేశంలోనే మొదటి ఫ్యూచర్-రెడీ సీఎఫ్ఓ ప్రోగ్రామ్‌ను ప్రకటించినందుకు సంతోషంగా ఉంది.
Railway Apprentice: రైల్వేలో 1785 అప్రెంటీస్ ఉద్యోగాలు.. అర్హతలు, దరఖాస్తు విధానం
ఈ ప్రోగ్రామ్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో ఫ్యూచర్ రెడీ సీఎఫ్ఓలను తయారు చేస్తాం. రాబోయే సంవత్సరాల్లో కొత్త తరం సీఎఫ్ఓలు కావాలని ఆకాంక్షించే వారికి ఈ కోర్సు అందిస్తాం. ప్రతిష్టాత్మక ఫైనాన్స్ నిపుణులతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. దీనికి విద్యార్థుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని విశ్వసిస్తున్నాము. ఈ కోర్సు ఆధునిక ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశిస్తున్నాం. ఫ్యూచర్ రెడీ సీఎఫ్ఓ ప్రోగ్రామ్ ఆర్థిక నిపుణులను కొత్త కెరీర్ (New Career) మార్గంలోకి నడిపిస్తుంది.” అని తెలిపారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://isb.talentsprint.com/cfo/ ను సందర్శించాలి.
Step 3: అనంతరం Admissions by selection. Limited seats కాలమ్‌లోకి వెళ్లాలి.
Step 4: పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి.
Step 5: అనంతరం Apply Now బటన్ ప్రెస్ చేయాలి.
Step 6 పూర్తి వివరాలతో కూడిన బ్రౌచర్ అందిస్తారు.
Step 7: బ్రౌచర్ ఆధారంగా దరఖాస్తు ఫాం.. పూర్తి చేయాలి.
కోర్సుకు సంబంధించిన క్లాస్‌లు జనవరి 28, 2022 నుంచి ఐఎస్బీ హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రారంభమవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Hyderabad, New course, Online Education