హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS Clerk English Tips: బ్యాంక్ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ ప్రధాన సమస్యగా ఉందా.. ఇలా చేస్తే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈజీనే..

IBPS Clerk English Tips: బ్యాంక్ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ ప్రధాన సమస్యగా ఉందా.. ఇలా చేస్తే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈజీనే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

బ్యాంకు పరీక్షల్లో ఇంగ్లీష్ ప్రధానమైన విభాగం. న్యూమరికాల్ ఎబిలిటీ, రీజనింగ్ ద్వారా జ్ఞానం వస్తే.. ఇంగ్లీష్ ద్వారా ప్రిలిమ్స్ పరీక్షలతో పాటు.. మెయిన్ పరీక్షలు కూడా ఇంగ్లీష్ సబ్జెక్టే ప్రధానం. మెరిట్ ద్వారా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఉద్యోగం రావాలంటే.. ఈ ఇంగ్లీష్ సబ్జెక్స్ ఎంతో ముఖ్యమైనది .

ఇంకా చదవండి ...

  (GK హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18)

  బ్యాంకు పరీక్షల్లో(Bank Exam) ఇంగ్లీష్(English) ప్రధానమైన విభాగం. న్యూమరికాల్ ఎబిలిటీ(Numerical Ability), రీజనింగ్(Reasoning) ద్వారా జ్ఞానం వస్తే.. ఇంగ్లీష్(English) ద్వారా ప్రిలిమ్స్ పరీక్షలతో(Prelims Exam) పాటు.. మెయిన్ పరీక్షలు(Main Exam) కూడా ఇంగ్లీష్ సబ్జెక్టే ప్రధానం. మెరిట్ ద్వారా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఉద్యోగం(Job) రావాలంటే.. ఈ ఇంగ్లీష్ సబ్జెక్స్ ఎంతో ముఖ్యమైనది . ఐబీపీఎస్ బ్యాంక్ పరీక్షలో ఇంగ్లీష్ లో మంచి మార్కులు సాధించాలంటే కింద తెలిపిన విధంగా ప్రిపేర్ అవ్వాలని తిరుపతిలోని సీఎల్ కోచింగ్ సెంటర్(Coaching Centre) ఎండీ శ్రీధర్(Sridhar) విద్యార్థులకు సూచించాడు.

  Samsung Galaxy S23 Ultra: శాంసంగ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. 200MP కెమెరాతో శాంసంగ్ మొబైల్.. పూర్తి వివరాలిలా..


  బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో నాలుగు అంశాలు ప్రధానమైనవి. అందులో ఒకటి గ్రామర్, రెండవది Vocabulary, మూడవది రీడింగ్, నాల్గవది లాజిక్. ఈ నాలుగు విభాగాలను ఇంగ్లీష్ లో ఫోకస్ చేయడం ద్వారా.. బ్యాంక్ పరీక్షలు ఏవైనా మార్కులు మీ సొంతం అవుతాయి. బ్యాంకింగ్ పరీక్ష రాసే అభ్యర్థులు కష్టంగా భావించేది ఇంగ్లీష్ మాత్రమే. మిగిలిన సబ్జెక్టులలో లాగా షార్ట్ కట్స్ ఇంగ్లీష్ కి ఉండదు.

  గ్రామర్: చిన్నప్పటి నుంచి గ్రామర్ ను చదువుతూనే ఉన్నాం. పార్ట్స్ అఫ్ స్పీచ్., టెన్సెస్., ప్యాసివ్ వాయిస్., రిపోర్ట్ డ్ స్పీచ్., మోడల్ వర్బ్స్., ఆర్టికల్స్., ప్రిపసన్స్ అనే టాపిక్స్ ను తరావుగా చదువుకోవాలి. దీన్ని ఓ బుక్ కొనుగోలు చేసి...పై టాపిక్స్ పై ప్రిపేర్ అవ్వవచ్చు.

  Vocabulary: స్పెల్లింగ్ మిస్టేక్స్ అడుగుతూ ఉంటారు. ఫిల్లింగ్ ధి బ్లాంక్స్ అడుగుతున్నారు. కొత్తగా వర్డ్ రీప్లేస్ మెంట్ అడుగుతున్నారు. మరియు మ్యాచ్ ది కాలమ్స్ అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ సిలబస్ లో చేర్చడం జరిగింది. చాలామంది ఒకాబిలరీ సాల్వ్ చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. లిమిటెడ్ పార్ట్ అఫ్ ఒకాబిలరీ రావడమే ఇందుకు ప్రధాన కారణం. మూడువేల కొత్త పదాలు నేర్చుకోవడం ద్వారా...ఒకాబిలారీ చాల ఈజీగా సాల్వ్ చేయవచ్చు. బట్టి కొట్టే మెథడ్ కి వెళ్తే తప్పు చేసినట్లే అవుతుంది. చదువుకోవడం ద్వారా కొత్త కొత్త పదాలు అందుబాటులోకి వస్తాయి.

  రీడింగ్: ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం ద్వారా ఒకాబిలరీ తో పాటుగా Reading Comprehension ఫుల్ ఫిల్ చేయగలరు. రోజుకి రెండు గంటల సమయం న్యూస్ పేపర్ చదవడం ద్వారా జనరల్ నాలెడ్జ్, న్యూ వర్డ్స్ ఐడెంటిఫికేషన్, ప్రతీ పేరాలో వచ్చిన డిఫికల్ట్ వర్డ్ లాంటివి వస్తే వాటిని అలనలైజ్ చేసి.. అండర్ లైన్ చేసుకోవాలి. డిక్షనరీ ద్వారా వాటి అర్థాలు తెలుసుకొని సాధన చేయాలి.

  School Assistant Preparation Tips: స్కూల్ అసిట్టెంట్ ఉద్యోగమే మీ లక్ష్యమా.. అయితే ఇలా చదవండి..


  లాజిక్స్: లాజిక్స్ లో ముఖ్యంగా ఫారా జంపింగ్ అడుగుతున్నారు. పేరాగ్రాఫ్ ను జుంబుల్ చేసి ఇస్తారు. వాటిని మనం అర్థం వచ్చే పేరాగ్రాఫ్ లా మార్చాలి. దీనికి ముఖ్యంగా లాజికల్ థియరీ అవసరం ఉంటుంది. ఇందుకు లాజికల్ థింకింగ్ వర్డ్స్ చాలా అవసరం. దీని కోసం ప్రతీ రోజు ఇంగ్లీష్ పేపర్ ను చదవడం నేర్చుకోవాలి. అంతే కాకుడా.. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారు కచ్చితంగా మోడల్ పరీక్షలు రాయడం అత్యంత అవసరం. దీని ద్వారా సమయం సేవ్ చేసుకోవచ్చు. ఇలా పైన చెప్పిన విధంగా ప్రపేర్ అయితే.. ఇంగ్లీష్ లో మంచి మార్కులు సాధించవచ్చు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Bank exam, Career and Courses, Clerk, IBPS, JOBS, Preparation

  ఉత్తమ కథలు