IRISH POLISH SANSKRIT SCHOLARS NAGA JOURNO AMONG 32 LITERATURE AND EDUCATION PADMA AWARDEES GH VB
Padma Awards: లిటరేచర్, ఎడ్యుకేషన్ రంగంలో విదేశీ సంస్కృత పండితులకు పద్మ అవార్డులు.. గ్రహీతలు ఎవరంటే..
లిటరేచర్, ఎడ్యుకేషన్ రంగంలో విదేశీ సంస్కృత పండితులకు పద్మ అవార్డులు..
2022 ఏడాదికిగానూ తాజాగా భారత కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డు (Padma Awards)లను ప్రకటించింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన పద్మ పురస్కారాల గ్రహీతల జాబితా ప్రకారం... ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి.
2022 ఏడాదికిగానూ తాజాగా భారత కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డు (Padma Awards)లను ప్రకటించింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన పద్మ పురస్కారాల గ్రహీతల జాబితా ప్రకారం... ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. ఇందులో 4 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ముఖ్యంగా సాహిత్యం, విద్యారంగం (Literature and Education)లో ప్రముఖ పండితులు, నవలా రచయితలు, ఆలోచనాపరులు (thinkers), విధాన రూపకర్తలు (policymakers), జర్నలిస్టులకు పద్మ పురస్కారాలు దక్కాయి.
ఇందులో ఐర్లాండ్, పోలాండ్ దేశాలకు చెందిన సంస్కృత పండితులు, నాగాలాండ్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ ప్రవచనకర్త కూడా ఉన్నారు. సైన్స్, విద్య, సాహిత్యం, సామాజిక సేవ మొదలైన రంగాల్లో కొందరు ప్రముఖులు మాత్రమే పద్మ అవార్డులు దక్కించుకోగా... సాహిత్యం, విద్య రంగంలో మొత్తం 32 మందికి పద్మవిభూషణ్, పద్మభూషణ్ నుంచి పద్మశ్రీల వరకు అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి.
సాహిత్యం, విద్యారంగంలో గీతా ప్రెస్ డైరెక్టర్ అయిన శ్రీ రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం)కు పద్మవిభూషణ్ లభించింది. అతనితో పాటు ముగ్గురు ప్రముఖ పాలసీ మేకర్స్ అయిన ప్రతిభా రే, స్వామి సచ్చిదానంద, శ్రీ వశిష్ఠ త్రిపాఠిలకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈ ఏడాది 28 మందికి పద్మశ్రీ అవార్డు లభించింది. ఈ జాబితాలో ఐర్లాండ్, పోలాండ్లకు చెందిన కొంతమంది ప్రముఖ సంస్కృత పండితులు, ఇండో-పాక్ యుద్ధాన్ని కవర్ చేసిన నాగాలాండ్ జర్నలిస్ట్ తోపాటు లడఖ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంతో మంది ప్రముఖ కవులు ఉన్నారు. సాహిత్యం, విద్యా రంగం నుంచి 2022లో పద్మ పురస్కారాలు అందుకున్న వారెవరో ఇప్పుడు చూద్దాం.
- శ్రీ రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), ఉత్తర్ప్రదేశ్.
* పద్మభూషణ్ పొందినవారు
- శ్రీమతి ప్రతిభా రే, ఒడిశా.
- స్వామి సచ్చిదానంద, గుజరాత్.
- శ్రీ వశిష్ఠ త్రిపాఠి, ఉత్తర్ప్రదేశ్.
పద్మశ్రీ అవార్డు పొందినవారు
శ్రీ టీ. సేన్కా అయో -T Senka Ao (నాగాలాండ్), శ్రీ జే.కే బజాజ్ (ఢిల్లీ), శ్రీ సిర్పి బాలసుబ్రహ్మణ్యం (తమిళనాడు), శ్రీ అఖోన్ అస్గర్ అలీ బషారత్ (లడఖ్), శ్రీ హర్మోహిందర్ సింగ్ బేడీ (పంజాబ్), శ్రీ మరియా క్రిస్టోఫర్ బైర్స్కీ (పోలాండ్), శ్రీ ఖలీల్ ధన్తేజ్వి (మరణానంతరం - గుజరాత్), శ్రీ నరసింహారావు గరికపాటి (ఆంధ్రప్రదేశ్), శ్రీ గిర్ధారి రామ్ ఘోంజు (మరణానంతరం) (జార్ఖండ్), శ్రీ షైబల్ గుప్తా (మరణానంతరం) (బీహార్), శ్రీ నరసింగ ప్రసాద్ గురు (ఒడిశా), శ్రీ అవధ్ కిషోర్ జాడియా (మధ్యప్రదేశ్), శ్రీ రట్గర్ కోర్టెన్హోస్ట్ (ఐర్లాండ్), శ్రీ పీ నారాయణ కురుప్ (కేరళ), శ్రీ వీ.ఎల్ న్ఘాకా (మిజోరం), శ్రీ చిరాపట్ ప్రపాండవిద్య (థాయిలాండ్), శ్రీ విద్యానంద్ సారెక్ (హిమాచల్ ప్రదేశ్), శ్రీ దిలీప్ షాహానీ (ఢిల్లీ), శ్రీ విశ్వమూర్తి శాస్త్రి (జమ్ముకశ్మీర్), శ్రీ కాళీ పాదా సరెన్ (పశ్చిమ బెంగాల్), శ్రీమతి టటియానా ల్వోవ్నా షౌమ్యన్ (రష్యా), శ్రీ సిద్ధలింగయ్య (మరణానంతరం) (కర్ణాటక), శ్రీమతి విద్యా విందు సింగ్ (ఉత్తర్ప్రదేశ్), శ్రీ రఘువేంద్ర తన్వర్ (హర్యానా), శ్రీమతి బడాప్లిన్ వార్ (మేఘాలయ), శ్రీ నజ్మ అక్తర్ (ఢిల్లీ), శ్రీ ధనేశ్వర్ ఎంగ్టి (అస్సాం), శ్రీమతి తారా జౌహర్ (ఢిల్లీ). ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరిగే వేడుకల్లో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఈ జాబితాను భారత రాష్ట్రపతి ఆమోదించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.