ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (Indian Rare Earths Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్/డిప్లొమా ట్రైనీ, సూపర్వైజర్ & తదితర విభాగాలతో సహా 54 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు సంబధించి దరఖాస్తు చేసుకొనేందుకు సెప్టెంబర్ 15, 2021న ప్రారంభమై అక్టోబర్ 5, 2021 వరకు అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక కేవలం పరీక్ష ద్వారా ఉంటుంది. పరీక్ష(Exam)లో ఉత్తీర్ణత సాధించిన వారిన మెరిట్ (Merit) ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ / మాస్టర్స్ డిగ్రీ / SSC లేదా తత్సమాన పరీక్ష/CA ఇంటర్మీడియట్ లేదా CMA ఇంటర్మీడియట్ (Intermediate)/గ్రాడ్యుయేట్ (Graduate)తో సహా కొన్ని విద్యార్హత(Education Qualification)లు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి చదవండి.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
గ్రాడ్యుయేట్ ట్రైనీ (ఫైనాన్స్) | CA ఇంటర్మీడియట్ లేదా CMA ఇంటర్మీడియట్/ 60శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కామర్స్‌లో గ్రాడ్యుయేట్(Graduate) పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 50శాతం మార్కులు వచ్చి ఉండాలి. వయసు 26 సంవత్సరాలు మించి ఉండకూడదు. | 07 |
గ్రాడ్యుయేట్ ట్రైనీ (హెచ్ఆర్) | 60శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. వయసు 26 సంవత్సరాలు మించి ఉండకూడదు. | 06 |
డిప్లమా ట్రైనీ (టెక్నికల్) | మూడు సంవత్సరాల డిప్లమాతో మైనింగ్(Mining) / కెమికల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / సివిల్ చేసి ఉండాలి. 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 50శాతం మార్కులు వచ్చి ఉండాలి. వయసు 26 సంవత్సరాలు మించి ఉండకూడదు. | 18 |
జూనియర్ సూపర్వైజర్ (రాజభాష) | హిందిలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అంతే కాకుండా ఒక సంవత్సరం ప్రభుత్వ సంస్థల్లో పని చేసి అనుభవం ఉండాలి. వయసు 30 సంవత్సరాలు మించి ఉండకూడదు. | 01 |
పర్సనల్ సెక్రటరీ | ఏదైన డిగ్రీ చేసి ఉండాలి. 40వర్డ్స్ టైపింగ్ స్పీడ్ (Typing Speed) వచ్చి ఉండాలి. వయసు 30 సంవత్సరాలు మించి ఉండకూడదు. | 02 |
ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ) | పదో తరగతి పాసై ఉండాలి. ఐటీఐ సర్టిఫికెట్ (Cetificate) కలిగి ఉండాలి. వయసు 35 సంవత్సరాలు మించి ఉండకూడదు. | 20 |
CLW Recruitment 2021: సీఎల్డబ్ల్యూలో 492 అప్రెంటీస్ పోస్టులు
ఎంపిక విధానం..
- కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థి ఎంపిక ఉంటుంది.
- పరీక్ష రాసి తరువాత మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ (Select) చేస్తారు.
- పరీక్ష సెలబస్, విధానం కోసం నోటిఫికేషన్ చూడండి.
దరఖాస్తు చేసుకొనే విధానం..
- దరఖాస్తు చేసుకోవానుకొన్న అభ్యర్థులు ముందుగా www.irel.co.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- అనంతరం కెరీర్ విభాగంలో నోటిఫికేషన్ చదవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- ఆన్లైన్ అప్లికేషన్‌కు వెళ్లాలి. (అప్లె చేయడం కోసం క్లిక్ చేయండి)
- ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సబ్మిట్ చేస్తే రిజిస్టర్ (Register) నంబర్ వస్తుంది.
- అనంతరం అప్లికేషన్ ఫాం (Application Form) నింపాలి.
- అప్లికేషన్ పూర్తయిన తరువాత హార్డ్ కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS