ఐటీఐ పాసైనవారికి గుడ్ న్యూస్. ఐటీఐ అర్హతతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పలు ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఐఆర్‌సీటీసీ నార్త్ జోన్ అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల్ని (Apprentice Trainee Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 80 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇవి ఏడాది గడువున్న అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 25 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష లేదు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
భర్తీ చేస్తున్న పోస్టులు | కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ |
మొత్తం ఖాళీలు | 80 |
విద్యార్హతలు | 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. |
వయస్సు | 2022 ఏప్రిల్ 1 నాటికి 15 ఏళ్ల నుంచి 25 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 10 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. |
ఎంపిక విధానం | మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
పోస్టింగ్ | ఢిల్లీ |
స్టైపెండ్ | నెలకు రూ.9,000 వరకు |
సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ | టెన్త్ మార్క్స్ షీట్, ఐటీఐ మార్క్స్ షీట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్. |
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
IOCL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ ఆయిల్ లో ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో 1535 జాబ్స్ .. పూర్తి వివరాలివే..
IRCTC Recruitment 2022: అప్లై చేయండి ఇలా
Step 1- అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- తమ వివరాలతో లాగిన్ కావాలి.
Step 3- లాగిన్ అయిన తర్వాత ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఐఆర్‌సీటీసీ అని సెర్చ్ చేయాలి.
Step 4- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
Step 5- అభ్యర్థులు తమ వివరాలతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
Step 6- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగలకు అలర్ట్.. ఆ 10 వేల ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్.. ఎందుకంటే?
దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులకు సెలెక్షన్‌కు సంబంధించిన సమాచారం వస్తుంది. అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ https://irctc.com/new-openings.html మాత్రమే ఫాలో కావాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, Job notification, JOBS