IRCTC Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి ఐఆర్‌సీటీసీలో 150 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

IRCTC Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి ఐఆర్‌సీటీసీలో 150 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Recruitment 2021 | ఐఆర్‌సీటీసీ పలు ఖాళీల భర్తీకి (IRCTC Jobs) దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలతో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. న్యూ ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) పోర్టల్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. 2021 అక్టోబర్ 10 లోగా అప్లై చేయాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇవి అప్రెంటీస్ పోస్టులు (Apprentice Jobs) మాత్రమే. అప్రెంటీస్ గడువు ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    AIIMS Mangalagiri Jobs 2021: రూ.2,15,900 వేతనంతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు

    IRCTC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    భర్తీ చేసే పోస్టులు- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్

    మొత్తం ఖాళీలు- 150

    విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి

    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 3

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 10

    వయస్సు- వయస్సు పరిమితి లేదు

    ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ

    దరఖాస్తు ఫీజు- ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

    అప్రెంటీస్ కాలం- 12 నెలలు

    వేతనం- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య వేతనం ఉంటుంది.

    పోస్టింగ్- ఐఆర్‌సీటీసీ కార్యాలయం, న్యూ ఢిల్లీ.

    WCL Recruitment 2021: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,281 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    IRCTC Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేసి Candidate క్లిక్ చేయాలి.

    Step 3- పేరు, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 4- రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

    Step 5- లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో Apprentices పైన క్లిక్ చేయాలి.

    Step 6- Apprentice Search లో ఐఆర్‌సీటీసీ టైప్ చేసి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లింక్ క్లిక్ చేయాలి.

    Step 7- ముందే రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు నేరుగా ఈ లింక్ క్లిక్ చేసినా దరఖాస్తు పేజీ ఓపెన్ అవుతుంది.

    Step 8- ఆ తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు చేయొచ్చు.

    Step 9- దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: