హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In IRCTC: IRCTCలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం..

Jobs In IRCTC: IRCTCలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం..

Jobs In IRCTC: IRCTCలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం..

Jobs In IRCTC: IRCTCలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం..

Jobs In IRCTC: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ వెస్ట్ జోన్ ముంబై లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(IRCTC) వెస్ట్ జోన్(West Zone) ముంబై లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఇచ్చిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని వెబ్ సైట్లోలో పేర్కొనలేదు.  దీనిలో మొత్తం 16 పోస్టులను భర్తీ చేస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హత..

కంప్యూటర్ ఆపరేటర్ -

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టుల ప్రకారం 10వ తరగతి వరకు చదివి ఉండాలి.

అభ్యర్థులు ఎంఎస్-ఆఫీస్, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.

అలాగే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థులు సంబంధిత పోస్ట్‌లో కనీస అనుభవం కలిగి ఉండాలి.

SSC Results: ఆ ఫలితాలను విడుదల చేసిన SSC.. Results, కట్ ఆఫ్ మార్కులను చెక్ చేసుకోండిలా..

ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టుల ప్రకారం 10వ తరగతి వరకు చదివి ఉండాలి.

అభ్యర్థులు ఎంఎస్-ఆఫీస్, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.

అలాగే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత పోస్ట్‌లో కనీస అనుభవం కలిగి ఉండాలి.

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

జీతం..

కంప్యూటర్ ఆపరేటర్ - నెలకు రూ. 7,000 – రూ. 9,000

ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - నెలకు రూ. 7,000 – 9,000

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

Step 1 : అభ్యర్థులు మందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

Step 2 : తర్వాత అప్లై ఫర్ దిస్ అపార్చినిటీపై క్లిక్ ఇవ్వాలి.

Step 3 : వెంటనే మరో వెబ్ పైజీకి రి డైరెక్ట్ అవుతుంది. దీనిలో రిజిస్టర్ కవాల్సి ఉంటుంది.

Step 4 : తర్వాత ఈ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి.

Step 5 : దీనిలో అప్లికేషన్ ఫారమ్ ను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించే సమయంలో రెజ్యూమ్ (బయోడేటా) 10వ, 12వ తరగతి మరియు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, లైసెన్స్), పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ లను దగ్గర పెట్టుకోవాలి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IRCTC, IRCTC Tourism, JOBS, Jobs in railway, Railway jobs

ఉత్తమ కథలు