IRCON RECRUITMENT 2021 ONLINE APPLICATIONS INVITED FOR 74 JOB VACANCIES HERE FULL DETAILS NS
IRCON Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. Indian Railwaysకు చెందిన సంస్థలో ఉద్యోగాలు
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ కు చెందిన IRCON సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే కనస్ట్రక్షన్ కంపెనీ(IRCON) శుభవార్త చెప్పింది. ఇండియర్ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ ప్రముఖ ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 74 ఖాళీల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. వర్క్స్ ఇంజనీర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. IRCON ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 18లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు. HPCLలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి మరో ఆరు రోజులే గడువు.. వివరాలివే.. ఇస్రోలో రూ.47 వేల వేతనంతో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్.. వివరాలివే
ఎవరు అప్లై చేయాలంటే..
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 74 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Works Engineer/Civil: ఈ విభాగంలో 60 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ, లేదా ఇనిస్ట్యూట్ లో 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Works Engineer/S&T: ఈ విభాగంలో 14 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థి ఆయా కోర్సుల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థలోనే ఆయా కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
-ఆయా ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం ఏడాది అనుభవం ఉండాలి. Notification-Direct Link Official Website-Direct Link
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 18లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఫొటో గ్రాఫ్, సిగ్నేచర్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్ ను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని DGM/HRM, Ircon International Ltd, C-4, District Centre, Saket, New Delhi 110017 చిరునామాకు ఈ నెల 28లోగా అందేలా పోస్టులో పంపించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చూడొచ్చు
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.