IRCON Recruitment 2021: భారతీయ రైల్వే సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IRCON Recruitment 2021: భారతీయ రైల్వే సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (image: IRCON)

IRCON Recruitment 2021 | ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వర్క్స్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భారతీయ రైల్వేకు చెందిన అనుబంధ సంస్థలు ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. భారతీయ రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్క్స్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 74 ఖాళీలున్నాయి. సివిల్, ఎస్ అండ్ టీ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 18 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలను https://ircon.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్‌ ప్రింట్ తీసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

    IRCON Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 74
    వర్క్స్ ఇంజనీర్ సివిల్- 60
    వర్క్స్ ఇంజనీర్ ఎస్ అండ్ టీ- 14

    Common Eligibility Test: రైల్వే జాబ్ సహా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

    Grow With Mi: 10,000 ఉద్యోగాలు... రూ.100 కోట్ల ప్యాకేజీ... ఇండియాలో షావోమీ ప్లాన్స్

    IRCON Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 23
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 18
    దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ-
    విద్యార్హతలు- సివిల్ ఇంజనీర్ పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. సివిల్ కన్‌స్ట్రక్షన్స్ వర్క్స్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. వర్క్స్ ఇంజనీర్ ఎస్ అండ్ టీ పోస్టుకు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. రైల్వే సిగ్నలింగ్ వర్క్స్ లేదా ఓఎఫ్‌సీ బేస్డ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్‌లో ఏడాది అనుభవం ఉండాలి.
    వయస్సు- 30 ఏళ్ల లోపు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
    ఎంపిక విధానం- అభ్యర్థులను 1:7 ప్రకారం కేటగిరీ వారీగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్, మార్కులు, అనుభవం లాంటివి పరిగణలోకి తీసుకుంటారు. వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
    పోస్టింగ్- ఇర్కాన్ ఆఫీస్ లేదా చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, కర్నాటక, రాజస్తాన్, బీహార్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, గుజరాత్, ఒడిషా రాష్ట్రాల్లో ఇర్కాన్ ప్రాజెక్టుల్లో పోస్టింగ్ ఉంటుంది.
    వేతనం- రూ.36,000.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    DGM/HRM,
    Ircon International
    Ltd.,
    C-4, District Centre,
    Saket,
    New Delhi - 110017.

    Indian Army Recruitment 2021: బీటెక్ పాస్ అయ్యారా? ఆర్మీలో ఈ ఉద్యోగాలు మీకోసమే

    Bank Jobs 2021: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 150 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భారతీయ రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థ. రైల్వే ఆధీనంలో పనిచేస్తుంది. రైల్వే, రహదారులు, భవనాలు, పవర్ సెక్టార్స్ లాంటివి నిర్మిస్తుంది. భారతదేశంలో మాత్రమే కాదు మలేషియా, బంగ్లాదేశ్, అల్జీరియా, ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, నేపాల్, శ్రీలంకలో ప్రాజెక్టులు చేపట్టింది.
    Published by:Santhosh Kumar S
    First published: