Home /News /jobs /

IRCON INTERNATIONAL LIMITED RELEASED JOB NOTIFICATION FOR 32 GRADUATE AND TECHNICIAN APPRENTICE POSTS SS

IRCON Recruitment 2021: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IRCON Recruitment 2021: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCON Recruitment 2021: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IRCON Recruitment 2021 | భారతీయ రైల్వేతో పాటు రైల్వేకు చెందిన ఇతర సంస్థలు జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు తెలుసుకోండి.

    భారతీయ రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 32 ఖాళీలు ఉన్నాయి. ఇవి ఒక ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. కోర్సు పూర్తి చేసి శిక్షణ తీసుకున్నా, ఏడాదికి పైగా అనుభవం ఉన్నా ఈ అప్రెంటీస్ పోస్టులకు అర్హులు కాదు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వెబ్‌సైట్ https://www.ircon.org/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

    IRCON Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 32

    గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 19
    సివిల్ ఇంజనీరింగ్- 12
    ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 4
    ఎస్ అండ్ టీ ఇంజనీరింగ్- 3

    టెక్నీషియన్ అప్రెంటీస్- 13
    సివిల్ ఇంజనీరింగ్- 8
    ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 3
    ఎస్ అండ్ టీ ఇంజనీరింగ్- 2

    UPSC CDS 2021: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో 339 జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

    UGC Scholarship: విద్యార్థులకు నెలకు రూ.7,800 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా

    IRCON Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 21
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 13
    విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి.
    వయస్సు- 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
    స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.10,000, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు రూ.8,500
    శిక్షణా కాలం- ఒక ఏడాది

    ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    RRB Group D Jobs: త్వరలో 1,03,769 రైల్వే ఉద్యోగాలకు పరీక్ష... సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి

    IRCON Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు https://www.ircon.org/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో HR & Career సెక్షన్ క్లిక్ చేయాలి.
    అందులో Career @ IRCON పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత Engagement of Apprentices under Apprentices Act, 1961 లింక్ పైన క్లిక్ చేయాలి.
    Apply Online పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    వేర్వేరు పేజీలకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉంటాయి.
    అప్లై చేయాలనుకున్న పోస్టు పక్కన ఉన్న Apply Online లింక్ క్లిక్ చేయాలి.
    అభ్యర్థి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు