హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Success Story: అలా చదివాను కాబట్టే సక్సెస్ అయ్యాను.. ఈ మూడు తప్పులు చేయొద్దంటున్న ఐపీఎస్ అధికారిణి..

Success Story: అలా చదివాను కాబట్టే సక్సెస్ అయ్యాను.. ఈ మూడు తప్పులు చేయొద్దంటున్న ఐపీఎస్ అధికారిణి..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

నిర్జా షా లక్ష్యం సివిల్స్. మూడో ప్రయత్నంలో సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఐపీఎస్ అధికారిణిగా పశ్చిమ బెంగాల్‌లో సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు టిప్స్‌ అందజేశారు. తన ప్రిపరేషన్‌ అనుభవాలను కూడా నిర్?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

కృషి, పట్టుదల ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అందరూ లక్ష్యం చేరుకునే వరకు శ్రమించరు. కొందరు మాత్రమే అడ్డంకులను అధిగమించి విజయతీరాలకు చేరుకుంటారు. అలాంటి వారిలో నిర్జా షా ఒకరు. ఆమె లక్ష్యం సివిల్స్. మూడో ప్రయత్నంలో సక్సెస్(Success) సాధించింది. ప్రస్తుతం ఐపీఎస్ అధికారిణిగా పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌(Preparation) అవుతున్న అభ్యర్థులకు టిప్స్‌(Tips) అందజేశారు. తన ప్రిపరేషన్‌ అనుభవాలను కూడా నిర్జా షా మీడియాతో పంచుకున్నారు.

సీరియస్‌గా దృష్టిసారించలేకపోయా

యూపీఎస్సీ సివిల్ పరీక్షల్లో మూడు తప్పులు చేసినట్లు నిర్జా షా చెప్పారు. పరీక్షను సీరియస్‌గా తీసుకోకపోడం తాను చేసిన మొదటి తప్పుగా పేర్కొన్నారు. దీంతో సివిల్స్ మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యానన్నారు. ఆ తరువాత ప్రిపరేషన్‌‌పై తీవ్రంగా దృష్టిసారించి మూడో ప్రయత్నంలో సివిల్స్ క్లియర్ చేశానని చెప్పుకొచ్చారు.

పూర్తి సిలబస్ కవర్ చేయలేదు

గతంలో కాలేజీతో పాటు సివిల్స్ ప్రిపరేషన్‌ను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించానని, అయితే ఒకపక్క కాలేజీ, మరోపక్క ప్రిపరేషన్‌తో చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు. ప్రిపరేషన్‌పై సరైన దృష్టి పెట్టలేకపోయానన్నారు. అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను కూడా పూర్తి చేయలేదని, మొదటిసారి ప్రిలిమ్స్ పరీక్షలో పాలిటీలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయానని అన్నారు. రెండో ప్రయత్నంలో ఫండమెంటల్స్‌ను మాత్రమే కవర్ చేశానని నిర్జా షా వవరించారు.

ఫెయిల్ అవుతానని భయపడ్డా

ప్రిపరేషన్ సమయంలో ‘ఇతరుల నుంచి ఎలాంటి సహాయం’ తీసుకోకపోవడం తన రెండో తప్పుగా నిర్జా షా చెప్పారు. ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అయితే ఎదురైయ్యే పరిణామాలను ఊహించుకుని కూడా భయపడినట్లు తెలిపారు. ప్రిపరేషన్‌పై మొదట్లో సరిగా దృష్టిసారించకపోవడంతో.. ఏం చేస్తున్నావని తనను అడిగిన వారికి సరైన సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు. యూపీఎస్సీ సివిల్స్‌కు సిద్ధమవుతున్న తన ఎక్స్‌టెండెడ్ సర్కిల్‌లోని వ్యక్తుల గురించి తనకు తెలుసని, అయితే పరీక్ష పోటీ స్వభావం కారణంగా వారిని సంప్రదించడానికి వెనుకాడానని నిర్జా షా చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ప్రిపేర్ అయ్యేవారు అలా చేయవద్దని ఆమె సూచించారు.

తన సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోవడాన్ని తన మూడో తప్పుగా నిర్జా షా తెలిపారు. సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఇతరుల మాదిరిగానే ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌కు (UPSC హోలీ గ్రెయిల్) మకాం మార్చినట్లు చెప్పారు. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక, కొద్ది రోజులకే ఇంటికి వచ్చేశానన్నారు. తన సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ఇంటి వద్దనే ప్రిపరేషన్ కొనసాగించి, ఎట్టకేలకు సివిల్స్ క్లియర్ చేశానని చెప్పారు.

Panchayat Secretary Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో 2560 పంచాయతీ సెక్రటరీ పోస్టులు..

8 గంటల ప్రకారం.. రెండేళ్లు ప్రిపరేషన్

పరీక్ష పరంగా అభ్యర్థుల నుంచి ఏది ఆశిస్తున్నారనే దానిపై అవగాహన ఉండాలని నిర్జా షా చెప్పారు. రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ 8 గంటల టైమ్ మేనేజ్‌మెంట్‌తో ప్రిపరేషన్ కొనసాగించాలని సూచించారు. హార్డ్‌వర్క్, పట్టుదల, దృఢ సంకల్పం ఉంటేనే సివిల్స్ క్లియర్ చేయడం సులభతరం అవుతుందని చెప్పుకొచ్చారు.

First published:

Tags: Civils, Csat, JOBS, Success story

ఉత్తమ కథలు