Home /News /jobs /

IPPB RECRUITMENT 2022 INDIA POST PAYMENTS BANK LIMITED INVITES APPLICATIONS FOR 650 GRAMIN DAK SEVAK POSTS KNOW HOW TO APPLY SS

IPPB Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 650 జాబ్స్... అప్లై చేయండి ఇలా

IPPB Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 650 జాబ్స్... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

IPPB Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 650 జాబ్స్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

IPPB Recruitment 2022 | డిగ్రీ పాసైనవారికి అలర్ట్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) డిగ్రీ అర్హతతో 650 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 55 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులున్నాయి. ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల్లో 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పుడు ఇండియా పోస్ట్‌కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి మరో నోటిఫికేషన్ రావడం విశేషం. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

IPPB Recruitment 2022: అర్హతలివే...


గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైనవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. గ్రామీణ డాక్ సేవక్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అవసరాన్ని బట్టి లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తుంది ఇండియా పోస్ట్. ఎంపికైనవారికి నెలకు రూ.30,000 వేతనం లభిస్తుంది.

Post Office Jobs: పరీక్ష లేకుండా 38,926 ఉద్యోగాలు... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


IPPB Recruitment 2022: దరఖాస్తు విధానం


Step 1- అభ్యర్థులు ముందుగా IPPB అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/ ఓపెన్ చేయాలి.

Step 2- Careers సెక్షన్‌లో గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ ఉంటుంది.

Step 3- Click here to apply పైన క్లిక్ చేయాలి.

Step 4- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

Step 5- Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

Step 6- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

Step 7- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి.

Step 8- రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 9- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

Step 10- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి.

Step 11- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 12- ఆరో దశలో ఫీజు పేమెంట్ చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Telangana Jobs: బీ రెడీ... మరో 9,168 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్... ఇంటర్ పాసైతే చాలు

ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 మే 20 చివరి తేదీ. జూన్ 4 వరకు దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. జూన్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఫలితాలు కూడా జూన్‌లో విడుదలవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Jobs, Central Government Jobs, Govt Jobs 2022, India post, India post payments bank, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు