నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (IOCL Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 513 ఖాళీలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (IOCL Notification) పేర్కొన్నారు. జూనియర్ ఇంజనీర్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
విద్యార్హతల వివరాలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కెమికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఫిజిక్స్/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుందని పేర్కొన్నారు.
SBI Recruitment 2023: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. 868 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఎలా అప్లై చేయాలంటే?
- అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.iocl.com/ ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే కెరీర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- Click here for Latest Job Opening అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- నోటిఫికేషన్ దగ్గర అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలను నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.