హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IOCL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ ఆయిల్ లో ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో 1535 జాబ్స్.. పూర్తి వివరాలివే..

IOCL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ ఆయిల్ లో ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో 1535 జాబ్స్.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (IOCL Job Notification) విడుదల చేసింది. మొత్తం 1535 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ట్రైన్డ్ అప్రెంటీస్ విభాగంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 24న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు నెల రోజుల సమయం ఇచ్చింది ఐఓసీఎల్. దరఖాస్తుకు అక్టోబర్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ iocl.comలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఖాళీ వివరాలు:

విభాగంఖాళీలు
ట్రేడ్ అప్రెంటిస్ - అటెండెంట్ ఆపరేటర్396
ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్)161
ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్)54
టెక్నీషియన్ అప్రెంటిస్ కెమికల్332
టెక్నీషియన్ అప్రెంటిస్- మెకానికల్163
టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్198
టెక్నీషియన్ అప్రెంటిస్198
సెక్రటేరియల్ అసిస్టెంట్39
ట్రేడ్ అప్రెంటీస్- అకౌంటెంట్45
ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్41
ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్)32

IOCL Recruitment 2022 ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 24

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ - అక్టోబర్ 23

SPP Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్స్ .. ఇలా అప్లై చేసుకోండి

విద్యార్హతలు:

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, క్లాస్ 12 విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇలా అప్లై చేయండి:

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://iocl.com/ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం Careers ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 3: తర్వాత Click here for Latest Job Opening ఓపెన్ చేయాలి.

Step 4: నోటిఫికేషన్ ఎంచుకుని అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

First published:

Tags: Central Government Jobs, Indian Oil Corporation, Job notification, JOBS

ఉత్తమ కథలు