Home /News /jobs /

IOCL RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 626 APPRENTICE POSTS HERE FULL DETAILS NS

IOCL Recruitment 2022: నిరుద్యోగులకు IOCL శుభవార్త.. 626 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 626 అప్రంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 626 అప్రంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 17న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో(Job Notification) స్పష్టం చేశారు. అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్ iocl.comలో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    విద్యార్హతల వివరాలు: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇతర పూర్తి విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు 18-24 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అయితే టెన్త్ మార్క్స్ మెమోను వయస్సుకు సంబంధించిన ధ్రువపత్రంగా పరిశీలిస్తారు.
    Navodaya Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త.. నవోదయ స్కూళ్లలో 1925 జాబ్స్.. ఇలా అప్లై చేయండి



    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://iocl.com/ను ఓపెన్ చేయాలి.
    Step 2: హోం పేజీలో “IndianOil for You” ట్యాబ్ కింద, “IndianOil for Careers” విభాగంలో “Apprenticeships.” ఆప్షన్ ను ఎంచుకోవాలి.
    Job Mela in AP: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. డిగ్రీ, పీజీ, డిప్లొమో, ఐటీఐ అర్హతతో 700 జాబ్స్.. ఏడాదికి రూ. 2.19 లక్షల వేతనం

    Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అనంతరం “Apply Online” ఆప్షన్ ను ఎంచుకోవాలి.
    Step 4: అనంతరం Online Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 5: కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.
    Step 6: అనంతరం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Indian Oil Corporation, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు