ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (IOCL Job Notification) విడుదల చేసింది. మొత్తం 1535 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ట్రైన్డ్ అప్రెంటీస్ విభాగంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 24న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు నెల రోజుల సమయం ఇచ్చింది ఐఓసీఎల్. దరఖాస్తుకు అక్టోబర్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ iocl.comలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు:
ట్రేడ్ అప్రెంటిస్ - అటెండెంట్ ఆపరేటర్ | 396 |
ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్) | 161 |
ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్) | 54 |
టెక్నీషియన్ అప్రెంటిస్ కెమికల్ | 332 |
టెక్నీషియన్ అప్రెంటిస్- మెకానికల్ | 163 |
టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ | 198 |
టెక్నీషియన్ అప్రెంటిస్ | 198 |
సెక్రటేరియల్ అసిస్టెంట్ | 39 |
ట్రేడ్ అప్రెంటీస్- అకౌంటెంట్ | 45 |
ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ | 41 |
ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్) | 32 |
IOCL Recruitment 2022 ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 24
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ - అక్టోబర్ 23
Railway Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు .. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం..
విద్యార్హతలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, క్లాస్ 12 విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Indian Oil Corporation, Job notification, JOBS