హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో 1535 జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో 1535 జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (IOCL Job Notification) విడుదల చేసింది. మొత్తం 1535 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ట్రైన్డ్ అప్రెంటీస్ విభాగంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 24న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు నెల రోజుల సమయం ఇచ్చింది ఐఓసీఎల్. దరఖాస్తుకు అక్టోబర్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ iocl.comలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఖాళీ వివరాలు:

విభాగంఖాళీలు
ట్రేడ్ అప్రెంటిస్ - అటెండెంట్ ఆపరేటర్396
ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్)161
ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్)54
టెక్నీషియన్ అప్రెంటిస్ కెమికల్332
టెక్నీషియన్ అప్రెంటిస్- మెకానికల్163
టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్198
టెక్నీషియన్ అప్రెంటిస్198
సెక్రటేరియల్ అసిస్టెంట్39
ట్రేడ్ అప్రెంటీస్- అకౌంటెంట్45
ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్41
ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్)32

IOCL Recruitment 2022 ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 24

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ - అక్టోబర్ 23

SPP Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్స్ .. ఇలా అప్లై చేసుకోండి

విద్యార్హతలు:

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, క్లాస్ 12 విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇలా అప్లై చేయండి:

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://iocl.com/ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం Careers ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 3: తర్వాత Click here for Latest Job Opening ఓపెన్ చేయాలి.

Step 4: నోటిఫికేషన్ ఎంచుకుని అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

First published:

Tags: Central Government Jobs, Job notification, JOBS

ఉత్తమ కథలు