కరోనా ప్రభావం తగ్గడంతో దేశంలో నియామకాలు (Jobs Recruitment) జోరందుకున్నాయి. ప్రైవేటు సంస్థలతో పాటు, పలు ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీగా అప్రంటీస్ ఖాళీల (Apprentice Vacancies) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థకు చెందిన వివిధ శుద్ధికర్మాగారాల్లో మొత్తం 1968 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే అప్రంటీస్ పూర్తైన అనంతరం అభ్యర్థులకు ఎంప్లాయిమెంట్ విషయంలో ఎలాంటి హక్కు ఉండదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ప్రతీ నెల స్టైఫండ్ (monthly stipend) చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
పోస్టులు, అర్హతల వివరాలు..
పోస్టు | అర్హతలు |
ట్రేడ్ అప్రంటీస్-అటెండెంట్ ఆపరేటర్(కెమికల్ ప్లాంట్) -కెమికల్ | ఫిజిక్స్, మాథ్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ తదితర సబ్జెక్టుల్లో మూడేళ్ల బీఎస్సీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. |
ట్రేడ్ అప్రంటీస్(ఫిట్టర్) | ఫిట్టర్ కోర్సులో ఐటీఐ |
ట్రేడ్ అప్రంటీస్(బాయిలర్)-మెకానికల్ | ఫిజిక్స్, మాథ్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మూడేళ్ల బీఎస్సీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు |
టెక్నికల్ అప్రంటీస్ - కెమికల్ | కెమికల్ ఇంజనీరింగ్ లేదా రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. |
టెక్నీషియన్ అప్రంటీస్ - మెకానికల్ | మెకానికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. |
టెక్నీషియన్ అప్రంటీస్- ఇన్స్ట్రుమెంటేషన్ | ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్టుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరిం్ లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. |
ట్రేండ్ అప్రంటీస్- సెక్రటేరియల్ అసిస్టెంట్ | బీఏ, బీఎస్సీ, బీకాం చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. |
ట్రేడ్ అప్రంటీస్ అకౌంటెంట్ | బీకాం చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. |
ట్రేడ్ అప్రంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ | క్లాస్ 12 పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. |
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత, ఆసక్త కలిగిన అభ్యర్థులు IOCL అధికారిక వెబ్ సైట్లో నవంబర్ 12వ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో స్కాన్ చేసిన ఫొటోగ్రాఫ్, సిగ్నేచర్ స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కాన్ కాపీల సైజ్ 50kbకి మించకూడదు. ఇతర పూర్తి వివరాలను అభ్యర్థులు అప్లికేషన్ పూర్తి చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Indian Oil Corporation, Job notification, JOBS