• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2021 INDIAN OIL CORPORATION LIMITED RELEASED NOTIFICATION FOR 505 APPRENTICE POSTS KNOW VACANCIES SS

IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 505 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 505 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 505 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2021 | ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాసైనవారికి శుభవార్త. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 505 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి తాత్కాలికంగా భర్తీ చేస్తున్న అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://iocl.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    IOCL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 505
    పశ్చిమ బెంగాల్ - 221
    బీహార్- 76
    ఒడిషా- 66
    జార్ఖండ్- 41
    అస్సాం- 80
    వీటితో పాటు ట్రేడ్ అకౌంటెంట్ పోస్టులు 21 ఉన్నాయి.

    Railway Recruitment 2021: భారతీయ రైల్వేలో 561 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    BARC Recruitment 2021: భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్‌లో 160 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    IOCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 28
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 26
    అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- 2021 మార్చి 1
    రాతపరీక్ష- 2021 మార్చి 14
    ఫలితాల విడుదల- 2021 మార్చి 25

    Indian Navy Recruitment 2021: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

    HCL Recruitment drive: నిరుద్యోగులకు శుభవార్త... విజయవాడలో 1000 పోస్టుల భర్తీకి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

    IOCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో మూడేళ్ల డిప్లొమా పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ అకౌంటెంట్ పోస్టుకు ఫుల్ టైమ్ డిగ్రీ పాస్ కావాలి.
    ఎంపిక విధానం- రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
    దరఖాస్తు విధానం- అభ్యర్థులు ఐఓసీఎల్ వెబ్‌సైట్‌తో పాటు అప్రెంటీస్‌షిప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published: