హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IOCL Recruitment 2020: ఐఓసీఎల్‌లో 543 ఉద్యోగాలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు

IOCL Recruitment 2020: ఐఓసీఎల్‌లో 543 ఉద్యోగాలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IOCL Recruitment 2020 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది.

  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే దేశంలోని వేర్వేరు రీజియన్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సదరన్ రీజియన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చెరిలో ఈ పోస్టులున్నాయి. మొత్తం 493 ఖాళీలను ప్రకటించింది. ఆ తర్వాత మరో 50 పోస్టుల్ని యాడ్ చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ లాంటి విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. మొత్తం 543 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/ లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.

  IOCL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


  మొదటి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీలు- 493

  తెలంగాణ- 61

  ఆంధ్రప్రదేశ్- 66

  కేరళ- 67

  కర్నాటక- 100

  తమిళనాడు, పుదుచ్చెరి- 199

  యాడ్ చేసిన పోస్టులు- 50

  తెలంగాణ- 6

  ఆంధ్రప్రదేశ్- 6

  కేరళ- 6

  కర్నాటక- 12

  తమిళనాడు, పుదుచ్చెరి- 20

  RRB Exams: ఆర్ఆర్‌బీ అభ్యర్థులకు అలర్ట్... ఎగ్జామ్‌కు వెళ్తే ఈ రూల్స్ పాటించాల్సిందే

  CBSE Scholarship: టెన్త్ పాసైన అమ్మాయిలకు సీబీఎస్ఈ స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా

  IOCL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 23 సాయంత్రం 5 గంటలు

  విద్యార్హతలు- సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, డిప్లొమా పాస్ కావాలి. బీఈ, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయకూడదు.

  వయస్సు- 2020 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

  ఎంపిక విధానం- రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

  BHEL Jobs 2020: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Wipro Jobs 2021: ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్... రూ.30,000 జీతంతో విప్రోలో ఉద్యోగాలు

  IOCL Recruitment 2020: అప్లై చేయండి ఇలా


  అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

  ఆ తర్వాత https://iocl.com/ ఓపెన్ చేయాలి.

  హోమ్ పేజీలో Careers పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత Apprenticeships పైన క్లిక్ చేయాలి.

  సదరన్ రీజియన్‌కు సంబంధించిన ట్రేడ్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కనిపిస్తుంది.

  Apply Online పైన క్లిక్ చేయాలి.

  దరఖాస్తు సమయంలో 10వ తరగతి మెమో, ఇతర క్వాలిఫికేషన్లకు సంబంధించిన సర్టిఫికెట్స్, పాస్ ఫోటో సిద్ధంగా ఉండాలి.

  ఆ తర్వాత మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో దరఖాస్తు పూర్తి చేయాలి.

  ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

  దరఖాస్తు పూర్తైన తర్వాత ప్రింట్ తీసుకొని కాపీ భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Indian Oil Corporation, Job notification, JOBS, NOTIFICATION

  ఉత్తమ కథలు