• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2020 INDIAN OIL CORPORATION LIMITED RELEASED NOTIFICATION TO FILL 404 TECHNICIAN AND TRADE APPRENTICE POSTS SS

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 404 జాబ్స్... వివరాలివే

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 404 జాబ్స్... వివరాలివే

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 404 జాబ్స్... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2020 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఈస్టర్న్ రీజియన్‌లో 404 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 404 ఖాళీలను ప్రకటించింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 10 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.iocl.com/ ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఐఓసీఎల్.

    IOCL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


    మొత్తం ఖాళీలు- 404
    టెక్నీషియన్ అప్రెంటీస్- 221
    ట్రేడ్ అప్రెంటీస్- 183
    విద్యార్హత- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఐటీఐ
    అనుభవం- ఏడాది అనుభవం ఉన్నవారు, ఇప్పటికే శిక్షణ తీసుకున్నవారు దరఖాస్తు చేయకూడదు.
    వయస్సు- 18 నుంచి 24 ఏళ్లు
    దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 21
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటలు
    అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- 2020 ఏప్రిల్ 14
    రాతపరీక్ష- 2020 ఏప్రిల్ 19

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: పీజీ పాసైనవారికి 150 జేఆర్ఎఫ్ పోస్టులు... వివరాలివే

    Govt Jobs: కరోనా ఎఫెక్ట్... 147 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త షెడ్యూల్

    Education Loan: ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు