• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2020 INDIAN OIL CORPORATION LIMITED RELEASED NOTIFICATION FOR ASSISTANT OFFICER POSTS SS

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2020 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే ఇంజనీర్, ఆఫీసర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఓ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దీంతో పాటు అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 మే 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.iocl.com/ చూడండి.

    IOCL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    భర్తీ చేయనున్న పోస్టులు- అసిస్టెంట్ ఆఫీసర్
    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2020 ఏప్రిల్ 7
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 26
    విద్యార్హత- కనీసం 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 50% మార్కులతో పాస్ అయితే చాలు. సీఏ ఇంటర్మీడియట్, సీఎంఏ ఇంటర్మీడియట్ పాసై ఉండాలి.
    అనుభవం- కనీసం మూడేళ్లు ఫైనాన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి.
    వయస్సు- 30 ఏళ్ల లోపు
    ఎంపిక విధానం- సీఏ ఇంటర్మీడియట్, సీఎంఏ ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
    వేతనం- నెలకు రూ.40,000
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Free Course: సాఫ్ట్‌వేర్ జాబ్ మీ కలా? ఈ ఫ్రీ కోర్సు చేయండి

    Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

    Jobs: సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... హైదరాబాద్‌ రీజియన్‌లో ఖాళీలు
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు