• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2020 INDIAN OIL CORPORATION LIMITED RELEASED NOTIFICATION 63 POSTS KNOW ELIGIBILITY AND OTHER DETAILS SS

IOCL Recruitment 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

IOCL Recruitment 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

IOCL Recruitment 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2020 | బీటెక్, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి కోర్సులు పాసైనవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పానిపట్ రిఫైనరీస్ డివిజన్‌లో 57 పోస్టులు, ఫరీదాబాద్‌లోని ఐఓసీఎల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో 6 పోస్టులు ఉన్నాయి. మొత్తం 63 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://iocl.com/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలున్నాయో లేదో తెలుసుకోవాలి. అభ్యర్థులు https://www.iocrefrecruit.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

    SSC Recruitment 2020: డిప్లొమా, బీటెక్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

    UPSC Recruitment 2020: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... రేపే చివరి తేదీ

    IOCL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 63
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్)- 49
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్)- 3
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 4
    జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్- 1
    చీఫ్ రీసెర్చ్ మేనేజర్- 2
    సీనియర్ రీసెర్చ్ మేనేజర్- 2
    రీసెర్చ్ ఆఫీసర్- 2

    BSF Recruitment 2020: బీఎస్ఎఫ్‌లో 228 కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు... ఖాళీల వివరాలివే

    MIDHANI Recruitment 2020: హైదరాబాద్ మిధానిలో 158 జాబ్స్... చివరి తేదీ ఎప్పుడంటే

    IOCL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 12
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 7 సాయంత్రం 5 గంటలు
    రాతపరీక్ష- 2020 నవంబర్ 29
    ఫలితాల విడుదల- 2020 డిసెంబర్ 18
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టోరల్ డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేయొచ్చు. నోటిఫికేషన్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.
    దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.150. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
    వయస్సు- 18 నుంచి 26 ఏళ్లు. ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    వేతనం- రూ.2,60,000 వరకు.
    Published by:Santhosh Kumar S
    First published: