• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2020 INDIAN OIL CORPORATION LIMITED RELEASED FRESH NOTIFICATION WITH 600 TRADE AND TECHNICIAN APPRENTICE POSTS SS

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 600 జాబ్స్... ఖాళీల వివరాలివే

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 600 జాబ్స్... ఖాళీల వివరాలివే

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 600 జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 600 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 600 ఖాళీలను ప్రకటించింది. వాస్తవానికి గతంలోనే 500 పోస్టులతో ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 మార్చి 20 వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. కరోనా వైరస్ సంక్షోభం నెలకొనడంతో మరోసారి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో మరో 100 పోస్టుల్ని చేర్చింది. దీంతో ప్రస్తుతం 600 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 21 చివరి తేదీ. అయితే ఫిబ్రవరి 22 నుంచి మార్చి 20 మధ్య ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేసిన దరఖాస్తుల్నే పరిగణలోకి తీసుకుంటారు. అడ్మిట్ కార్డుల విడుదల, రాతపరీక్షల వివరాలను త్వరలో వెల్లడించనుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నీషియన్ అప్రెంటీస్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ లాంటి ట్రేడ్స్‌లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాలతో పాటు దాద్రా అండ్ నగర్ హవేలీలోని యూనిట్లలో వీరిని నియమించనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ https://www.iocl.com/ ఓపెన్ చేసి చూడొచ్చు.

    IOCL recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 600
    విద్యార్హత- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు ఇంజనీరింగ్‌లో 3 ఏళ్ల డిప్లొమా. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మే 22
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 21
    రాతపరీక్ష- త్వరలో వెల్లడించనున్న ఐఓసీఎల్
    ఐఓసీఎల్ జారీ చేసిన జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంచిన టీఎస్‌పీఎస్‌సీ

    Jobs: నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

    UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మరో ఛాన్స్
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు