IOCL Jobs: ఐఓసీఎల్‌లో 404 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IOCL Recruitment 2020 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 2, 2020, 6:30 PM IST
IOCL Jobs: ఐఓసీఎల్‌లో 404 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
IOCL Jobs: ఐఓసీఎల్‌లో 404 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న యూనిట్లలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే వెస్టర్న్ డివిజన్‌లో 600 పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పుడు ఈస్టర్న్ రీజియన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 404 పోస్టుల్ని ప్రకటించింది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్‌ను గతంలోనే విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 10 చివరి తేదీ. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నియామక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 18 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. ఆసక్తి గల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.iocl.com/ ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

IOCL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 404
టెక్నీషియన్ అప్రెంటీస్- 221
ట్రేడ్ అప్రెంటీస్- 168
ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటెంట్)- 15

IOCL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...

దరఖాస్తు ప్రారంభం- 2020 మే 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 18
విద్యార్హత- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఐటీఐ
అనుభవం- ఏడాది అనుభవం ఉన్నవారు, ఇప్పటికే శిక్షణ తీసుకున్నవారు దరఖాస్తు చేయకూడదు.
వయస్సు- 18 నుంచి 24 ఏళ్లు
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో 617 టికెట్ క్లర్క్, లోకో పైలట్, జేఈ జాబ్స్.. ఖాళీల వివరాలివే

SSC Jobs: గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడంటే

Jobs: కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్‌లో 2167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 2, 2020, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading