IOCL Jobs 2020: మొత్తం 500 ఖాళీల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్

IOCL recruitment 2020 | ఐఓసీఎల్‌లో 500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 20 చివరి తేదీ.

news18-telugu
Updated: February 25, 2020, 4:51 PM IST
IOCL Jobs 2020: మొత్తం 500 ఖాళీల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్
IOCL Jobs 2020: మొత్తం 500 ఖాళీల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL పలు రాష్ట్రాల్లో ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐఓసీఎల్. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నీషియన్ అప్రెంటీస్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ లాంటి ట్రేడ్స్‌లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాలతో పాటు దాద్రా అండ్ నగర్ హవేలీలోని యూనిట్లలో వీరిని నియమించనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ https://www.iocl.com/ ఓపెన్ చేసి చూడొచ్చు. అభ్యర్థులు అప్రెంటీస్‌షిప్ పోర్టల్ http://www.apprenticeship.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

IOCL recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 500

టెక్నీషియన్ అప్రెంటీస్- 265
ట్రేడ్ అప్రెంటీస్- 235
విద్యార్హత- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు ఇంజనీరింగ్‌లో 3 ఏళ్ల డిప్లొమా. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 22దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 20
రాతపరీక్ష- 2020 మార్చి 29
ఐఓసీఎల్ జారీ చేసిన జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

LIC Recruitment 2020: ఎల్ఐసీలో 218 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Doordarshan Jobs: విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు... అప్లై చేయండిలా
First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు