IOCL Jobs: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

IOCL GATE Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL పలు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 11, 2020, 11:00 AM IST
IOCL Jobs: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
IOCL Jobs: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇంజనీర్, ఆఫీసర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కొద్ది రోజుల క్రితం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు 2020 మే 6న ముగిసింది. కానీ కరోనా వైరస్ లాక్‌డౌన్ కొనసాగుతున్నందున చివరి తేదీని పొడిగించింది ఐఓసీఎల్. ఆసక్తి గల అభ్యర్థులు 2020 మే 24 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.iocl.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇంజనీర్, ఆఫీసర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ పోస్టులకు కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఐఓసీఎల్. ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. గ్రాడ్యుయేట్ యాప్టట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్-GATE 2020 ఎగ్జామ్ ద్వారా వీరిని ఎంపిక చేయనుంది ఐఓసీఎల్.

IOCL GATE Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు



భర్తీ చేయనున్న పోస్టులు- ఇంజనీర్, ఆఫీసర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 24
విద్యార్హత- కెమికల్, పెట్రోకెమికల్, పాలిమర్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో బీటెక్ లేదా బీఈ. గేట్ 2020 స్కోర్ కూడా ఉండాలి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Free Courses: కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా? ఈ 49 ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీ

Jobs: కరోనా కష్టకాలంలో కూడా ఈ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్

Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: May 11, 2020, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading