• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2020 INDIAN OIL CORPORATION LIMITED EXTENDED APPLICATION DEADLINE FOR ASSISTANT OFFICER POSTS TILL MAY 24 SS

IOCL Jobs: ఐఓసీఎల్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

IOCL Jobs: ఐఓసీఎల్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

IOCL Jobs: ఐఓసీఎల్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2020 | ఐఓసీఎల్ ఉద్యోగాల భర్తీకి అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తు గడువు పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంజనీర్, ఆఫీసర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులతో పాటు అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకూ దరఖాస్తు గడువును పెంచింది. ఈ పోస్టులకు మే 6న దరఖాస్తు గడువు ముగిసింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో మే 24 వరకు అప్లై చేయడానికి అవకాశం కల్పించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.iocl.com/ చూడండి.

    IOCL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    భర్తీ చేయనున్న పోస్టులు- అసిస్టెంట్ ఆఫీసర్
    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2020 ఏప్రిల్ 7
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 24
    విద్యార్హత- కనీసం 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 50% మార్కులతో పాస్ అయితే చాలు. సీఏ ఇంటర్మీడియట్, సీఎంఏ ఇంటర్మీడియట్ పాసై ఉండాలి.
    అనుభవం- కనీసం మూడేళ్లు ఫైనాన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి.
    వయస్సు- 30 ఏళ్ల లోపు
    ఎంపిక విధానం- సీఏ ఇంటర్మీడియట్, సీఎంఏ ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
    వేతనం- నెలకు రూ.40,000
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: రైల్వే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Free Courses: ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు... 5 వెబ్‌సైట్స్ ఇవే

    Jobs: ఉద్యోగాల భర్తీకి ఐసీఎంఆర్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు