• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2020 ENGINEERS AND TECHNICIANS CAN APPLY FOR 47 VACANCIES NS

IOCL Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. రూ. లక్ష వరకు వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

IOCL Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. రూ. లక్ష వరకు వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంస్థ తాజాగా మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంస్థ తాజాగా మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 47 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంజనీర్, టెక్నీషియన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్- IV ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 25 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్-I పోస్టులకు ఎంపికైన వారికి రూ.23 వేల నుంచి రూ. 78 వేల వరకు చెల్లించనున్నారు.

    విద్యార్హతల వివరాలు
    మూడేళ్లు ఫుల్ టైమ్ డిప్లొమో పూర్తి చేసిన వారు లేదా రెండేళ్లు ఐటీఐ పూర్తి చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీద్వారా నోటిఫికేషన్లో సూచించిన విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారు దరఖాస్తుకు చేసుకోవచ్చు.
    -టెన్త్, ఐటీఐని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC) పొంది ఉండాలి. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

    ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. 499 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

    ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జనవరి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
    Official Website


    Official Notification
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు