IOCL Jobs: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు... ఫిబ్రవరి 24 లాస్ట్ డేట్

IOCL Jobs: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు... ఫిబ్రవరి 24 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Data Entry Operator Recruitment 2020 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 24 చివరి తేదీ. మొత్తం 21 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. ఫ్రెషర్‌తో పాటు స్కిల్డ్ సర్టిఫికెట్ హోల్డర్లను ఈ పోస్టుల్లో నియమించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు & పుదుచ్చెరి, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోని ఐఓసీఎల్ యూనిట్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.iocl.com/ వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో Apprenticeships క్లిక్ చేసి చూడొచ్చు.

    IOCL Data Entry Operator Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం ఖాళీలు- 21 పోస్టులు
    తెలంగాణ- 3
    ఆంధ్రప్రదేశ్- 3
    తమిళనాడు & పుదుచ్చెరి- 8
    కర్నాటక- 4
    కేరళ- 3

    IOCL Data Entry Operator Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 10
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 24
    పరీక్ష తేదీ- 2020 మార్చి 8
    సర్టిఫికెట్ వెరిఫికేషన్- 2020 మార్చి 12
    విద్యార్హత- 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి.
    వయస్సు- 18 నుంచి 24 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

    UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

    Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

    Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు
    Published by:Santhosh Kumar S
    First published: