• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2020 50 ADDITIONAL TRADE APPRENTICE VACANCIES ANNOUNCED IN NORTHERN REGION NS

IOCL Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

IOCL Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరో శుభవార్త చెప్పింది. ఇటీవల 436 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే వాటితో పాటు తాజాగా మరో 50 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

  • Share this:
    నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరో శుభవార్త చెప్పింది. ఇటీవల 436 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే వాటితో పాటు తాజాగా మరో 50 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీతో మొత్తం పోస్టుల సంఖ్య 486కు చేరింది. ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. వారికి నిబంధనల ప్రకారం ప్రతీ నెల స్కాలర్ షిప్ చెల్లించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం కోసం ఈ నెల 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే..
    -Trade apprentice retail sales associate ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారు 12వ తరగతి పాసై ఉండాలి.
    -Trade apprentice retail sales associate(skill certificate holder) ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారు 12 పాసై ఉండాలి. ‘Retail Trainee Associate’గా సర్టిఫికేట్ పొందిన వారై ఉండాలి. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే

    ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆన్లోన్లో చేసుకోవాల్సి ఉంటుంది.
    Official Notification
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు