• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2019 INDIAN OIL CORPORATION LIMITED INVITES APPLICATIONS FOR 413 TRADE AND TECHNICIAN APPRENTICES POSTS APPLY BEFORE AUGUST 7 SS

Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2019 | ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్ ఐటీఐ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ కావాలి.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL టెక్నికల్, నాన్-టెక్నికల్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరీలో మొత్తం 413 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. తెలంగాణలో 36, ఆంధ్రప్రదేశ్‌లో 36 పోస్టులున్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, అకౌంటెంట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐఓసీఎల్. దరఖాస్తుకు ఆగస్ట్ 7 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఐఓసీఎల్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    IOCL Apprentice Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


    మొత్తం ఖాళీలు- 413
    దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 17
    దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 7
    విద్యార్హత: ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్ ఐటీఐ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ కావాలి. నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు 50% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Huawei Y9 Prime: ఇండియాలో రిలీజైన హువావే వై9 ప్రైమ్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    IBPS PO Jobs: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

    Railway Jobs: రైల్వేలో 313 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

    High Court Jobs: తెలంగాణ హైకోర్టులో 1539 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు