IOCL Recruitment 2021: డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారికి ఐఓసీఎల్‌లో 535 ఉద్యోగాలు... రూ.1,05,000 వేతనం

IOCL Recruitment 2021: డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారికి ఐఓసీఎల్‌లో 535 ఉద్యోగాలు... రూ.1,05,000 వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2021 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ (Junior Engineering Assistant) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. విద్యార్హతల వివరాలతో పాటు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 535 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 21న దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 12 చివరి తేదీ. డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పోస్టులో దరఖాస్తు ఫామ్ పంపాలి. వేర్వేరు రిఫైనరీలకు వేర్వేరు అడ్రస్‌లు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.

    IOCL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...













































    మొత్తం ఖాళీలు 535
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ప్రొడక్షన్) 296
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (పీ అండ్ యూ) 35
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఎలక్ట్రికల్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 65
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (మెకానికల్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 27
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 64
    జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ IV 29
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఫైర్ అండ్ సేఫ్టీ) 14
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 4
    జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ IV 1

    TCS Jobs 2021: హైదరాబాద్ టీసీఎస్‌లో ఉద్యోగాలు... డిగ్రీ పాస్ అయితే చాలు

    IOCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 21

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 12

    దివ్యాంగులు స్క్రైబ్ కోసం ప్రొఫార్మా సబ్మిట్ చేయడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 18

    అప్లికేషన్ ప్రింట్ కాపీ, డాక్యుమెంట్ ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 23

    రాతపరీక్ష- 2021 అక్టోబర్ 24

    ఫలితాల విడుదల- 2021 నవంబర్ 11

    విద్యార్హతలు- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ పాస్ కావాలి.

    దరఖాస్తు ఫీజు- రూ.150.

    వేతనం- రూ.1,05,000

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Railway Jobs: రైల్వేలో 3093 ఉద్యోగాలు... ఆ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

    IOCL Recruitment 2021: దరఖాస్తు విధానం


    Step 1- అభ్యర్థులు ముందుగా https://iocl.com/latest-job-opening లింక్ ఓపెన్ చేయాలి.

    Step 2- నాన్ ఎగ్జిక్యూటీవ్ పర్సనల్‌లో Click here to Apply Online పైన క్లిక్ చేయాలి.

    Step 3- మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టును సెలెక్ట్ చేయాలి.

    Step 4- ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.

    Step 5- మీరు ఏ రిఫైనరీలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో సెలెక్ట్ చేయాలి.

    Step 6- ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.

    Step 7- మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు చేయాలి.

    Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

    Step 9- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

    Step 10- అప్లికేషన్ ఫామ్‌పైన సంతకం చేసి, ఫోటో అతికించి, జిరాక్స్ కాపీస్ జత చేసి పోస్టులో పంపాలి.
    Published by:Santhosh Kumar S
    First published: