హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IOCL Jobs 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 570 ఉద్యోగాలు... డిప్లొమా పాసైతే చాలు

IOCL Jobs 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 570 ఉద్యోగాలు... డిప్లొమా పాసైతే చాలు

IOCL Jobs 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 570 ఉద్యోగాలు... డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాసైతే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

IOCL Jobs 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 570 ఉద్యోగాలు... డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Apprentice Recruitment 2022 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 570 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

డిప్లొమా పాస్ అయినవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా, ఐటీఐ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. మొత్తం 570 ఖాళీలను ప్రకటించింది. వెస్టర్న్ రీజియన్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, గోవా, దాద్రా నగర్ హవేలీలోని ఐఓసీఎల్ యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 15 చివరి తేదీ.

అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అంతకన్నా ముందు ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (RDAT) పోర్టల్, టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (BOAT) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఆ తర్వాతే ఐఓసీఎల్ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

HPCL Recruitment 2022: విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

IOCL Apprentice Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు570
మహారాష్ట్ర322
గుజరాత్121
మధ్యప్రదేశ్80
చత్తీస్‌గఢ్35
గోవా8
దాద్రా నగర్ హవేలీ4


UOH Recruitment 2022: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీలు... పరీక్ష లేకుండా ఉద్యోగం

IOCL Apprentice Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 15

విద్యార్హతలు- అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్, మెషినిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రీటైల్ అసోసియేట్ లాంటి సబ్జెక్ట్స్‌లో డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ పాస్ కావాలి.

ఇతర నిబంధనలు- కోర్సు పూర్తి చేసి మూడేళ్లు పూర్తైనవారు అర్హులు కాదు. బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, ఎల్ఎల్‌బీ, ఎంసీఏ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు అప్లై చేయకూడదు.

వయస్సు- 2022 జనవరి 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

అప్రెంటీస్ గడువు- 12 నెలలు

ఎంపిక విధానం- రాతపరీక్ష

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Jobs 2022: దక్షిణ మధ్య రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు వారమే గడువు

IOCL Apprentice Recruitment 2022: దరఖాస్తు విధానం


Step 1- ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు RDAT పోర్టల్, టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు BOAT పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత https://www.rectt.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- Candidate Registration పైన క్లిక్ చేయాలి.

Step 3- టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ టెక్నికల్, ట్రేడ్ అప్రెంటీస్ నాన్ టెక్నికల్ పోస్టులకు లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.

Step 4- పోస్టు పేరు సెలెక్ట్ చేసి Apply పైన క్లిక్ చేయాలి.

Step 5- RDAT లేదా BOAT రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 6- పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

Step 7- విద్యార్హతల సర్టిఫికెట్స్, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 8- దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

First published:

Tags: Central Government Jobs, Govt Jobs 2022, Indian Oil Corporation, Job notification, JOBS

ఉత్తమ కథలు