హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IOCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో 300 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

IOCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో 300 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో 300 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో 300 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ కేటగిరీలో ఈ అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం నెల వారీగా స్టైపండ్ (stipend) చెల్లించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

మెకానికల్, ఎలక్ట్రికల్, టెలీకమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంట్స్ లేదా ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఆపరేటర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.

Trade Apprentice: ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లేదా మిషినిస్ట్ కోర్సు చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

Technician Apprentice: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

Trade Apprentice Accountant: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

BECIL Recruitment: బీఈసీఐఎల్‌ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఖాళీలు, విద్యార్హత వివరాలివే..

Trade Apprentice Data Entry Operator (Fresher Apprentices): 12వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

Trade Apprentice Data Entry Operator: 12వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు లేదా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

Trade Apprentice-Retail Sales Associate (Fresher): 12వ తరగతి పాసైన నాన్ గ్రాడ్యుయేట్స్ ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

Trade Apprentice-Retail Sales Associate (Skilled Certificate Holders): 12వ తరగతి పాసై ‘Retail Trainee Associate’ స్కిల్ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

CDAC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. C-DACలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ఎలా అప్లై చేయాలంటే..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

-Trade Apprentice - ITI అభ్యర్థులు http://apprenticeshipindia.org/candidate-registration ఈ లింక్ తో అప్లై చేసుకోవాలి.

-Trade Apprentice Accountant అభ్యర్థులు http://apprenticeshipindia.org/candidate-registration ఈ లింక్ తో అప్లై చేసుకోవాలి.

-Trade Apprentice- Data Entry Operator & Retails Sales Associate అభ్యర్థులు http://apprenticeshipindia.org/candidate-registration ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

-Technician Apprentice – Diploma అభ్యర్థులు https://www.mhrdnats.gov.in/boat/commonRedirect/registermenunew!registermenunew.action లింక్ ద్వారా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

First published:

Tags: Central Government Jobs, Government jobs, Indian Oil Corporation, Job notification, JOBS, Scholarship

ఉత్తమ కథలు