PG Students: పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నెలకు రూ.12,400 స్టైఫండ్​.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

PG Students: ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక స్థోమత లేక చాలా మంచి విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమవుతున్నారు. అటువంటి వారికి సహకారం అందించేందుకు ఆల్​ ఇండియా సెంటర్​ ఫర్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ (ఏఐసీటీఈ) సరికొత్త స్కాలర్​షిప్​ను ప్రారంభించింది.

  • Share this:
ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక స్థోమత లేక చాలా మంచి విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమవుతున్నారు. అటువంటి వారికి సహకారం అందించేందుకు ఆల్​ ఇండియా సెంటర్​ ఫర్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ (AICTE) సరికొత్త స్కాలర్​షిప్ (Scholarships)​ను ప్రారంభించింది. ఏఐసీటీఈ(Aicte) ఆమోదించిన సంస్థలు లేదా యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు.

ఐటీ ఉద్యోగాల కోసం చూసేవారికి గుడ్‌న్యూస్.. ట్రైనింగ్ ఇచ్చిమరీ ఉద్యోగాల్లోకి తీసుకోనున్న HCL సంస్థ.. పూర్తి వివరాలు ఇవే..


ఎంపికైన విద్యార్థులకు ఏఐసీటీఈ రెండేళ్ల పాటు ప్రతినెలా రూ .12,400 చొప్పున స్కాలర్​షిప్​ అందజేస్తుంది. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్​షిప్​ పొందేందుకు అర్హులు. అయితే వారు తప్పనిసరిగా గేట్, CEED లేదా GPAT క్వాలిఫై అయి​ ఉండాలి. ఈ స్కాలర్​షిప్​ అర్హత, దరఖాస్తు విధానం మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Twitter Video Download: ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్‌లో ట్విట్టర్ వీడియోలను ఎలా సేవ్ చేయాలి.. తెలుసుకోండి..


ఏఐసీటీఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ ముఖ్యాంశాలు

ఏఐసీటీఈ స్కాలర్​షిప్​ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించే ముందు విద్యార్థులు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో చూద్దాం.

గేట్, జీప్యాట్​ లేదా సీడ్​ అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

అభ్యర్థులు ఫుట్​ టైమ్​ రీసెర్చ్​ స్కాలర్​గా ప్రవేశం పొందాలి. పార్ట్​టైమ్​ విధానంలో పీజీ చేసే వారు దరఖాస్తుకు అనర్హులు.

ఐదేళ్ల డ్యుయల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ చేస్తున్న విద్యార్థులు చివరి ఏడాది.. అంటే 9వ సెమిస్టర్ నుంచి స్కాలర్‌షిప్‌కు అర్హులు. అయితే వారు మునుపటి ఏడాదిలో 8 లేదా అంతకంటే ఎక్కువ CGPA స్కోరు సాధించి ఉండాలి.

Viral Video: కొత్తగా.. సరికొత్తగా.. కొత్త పెళ్లి జంట.. జేసీబీలో ఇలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..


స్కాలర్‌షిప్ గరిష్టంగా 24 నెలల పాటు లేదా కోర్సు పూర్తయ్యే వరకు అందజేస్తారు.

ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి వారానికి 8 నుంచి 10 గంటలు వారి విద్యాసంస్థ సూచించిన మేరకు టీచింగ్, రిసెర్చ్ కార్యకలాపాల్లో పాల్గొనాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్​కు దరఖాస్తు చేయడానికి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఆధార్ నంబర్ లేని దరఖాస్తులను స్వీకరించమని ఏఐసీటీఈ నోటిఫికేషన్​లో పేర్కొంది.

అర్హత గల విద్యార్థులు ఏఐసీటీఈ అధికారిక వెబ్‌సైట్ https://pgscholarship.aicte-india.org/ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. విదేశీ విద్యార్థులు, స్పాన్సర్డ్​ అభ్యర్థులు, మేనేజ్‌మెంట్ కోటా ద్వారా ప్రవేశాలు పొందిన వారు స్కాలర్‌షిప్‌కు అనర్హులని ఏఐసీటీఈ పేర్కొంది.
Published by:Veera Babu
First published: