INVITATION FOR APPLICATIONS FOR QUAD FELLOWSHIP FULL DETAILS ABOUT THE PROGRAM HERE GH VB
Quad Fellowship: క్వాడ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ప్రోగ్రామ్ గురించి పూర్తి వివరాలు..
ప్రతీకాత్మక చిత్రం
క్వాడ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌కు భారతీయ విద్యార్థులు (Indian Students) కూడా దరఖాస్తు చేసుకోవాలని స్వయానా ప్రధాని మోదీ (Narendra Modi) ఓ లేటెస్ట్ వీడియో మెసేజ్ ద్వారా కోరారు.
సరికొత్త అవకాశాల కోసం ఇండియన్ స్టూడెంట్స్‌కు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ (Fellowship Programmes) బాగా ఉపయోగపడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ కలిసి క్వాడ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ (Quad Fellowship Programme)ను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ క్వాడ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌కు భారతీయ విద్యార్థులు (Indian Students) కూడా దరఖాస్తు చేసుకోవాలని స్వయానా ప్రధాని మోదీ (Narendra Modi) ఓ లేటెస్ట్ వీడియో మెసేజ్ ద్వారా కోరారు. ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ఇండియన్ విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌లో గ్రాడ్యుయేట్, డాక్టరేట్ ప్రోగ్రామ్‌లను పూర్తి చేయడానికి గొప్ప అవకాశాలను అందిస్తుందన్నారు. ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ - quadfellowship.orgని విజిట్ చేయవచ్చు. జూన్ 30, 2022 లోగా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఆస్ట్రేలియా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ వంటి నాలుగు దేశాల్లోని ఇంజనీర్లు, మ్యాథమెటిషియన్స్, సైంటిస్ట్స్, టెక్నాలజిస్ట్స్ (ఒక్కో దేశం నుంచి 25 మంది) ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రముఖ స్టెమ్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలను అభ్యసించడానికి ఫెలోషిప్ ప్రతి సంవత్సరం ప్రతి క్వాడ్ దేశం నుంచి 25 మంది విద్యార్థులను స్పాన్సర్ చేస్తుంది. మొత్తంగా పాల్గొనే 100 మందిని ఒకచోట చేర్చడమే లక్ష్యంగా ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఆగస్టు 2023 నుంచి మే 2024 వరకు యునైటెడ్ స్టేట్స్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM)లో చదువుకోవడానికి ఫెలోషిప్ ప్రోగ్రామ్ అన్ని వసతులు కల్పిస్తుంది. ప్రతి క్వాడ్ ఫెలో మెంబర్ ట్యూషన్ & రీసెర్చ్ ఫీజులు, పుస్తకాలు, రూమ్, బోర్డు, ఇతర విద్యాపరమైన ఖర్చుల కోసం 50,000 డాలర్లను వన్-టైమ్ అవార్డుగా అందుకుంటారు. యునైటెడ్ స్టేట్స్లో గ్రాడ్యుయేట్ డిగ్రీలు పూర్తి చేయడానికి, పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది.
My message on the launch of the Quad Fellowship, which will benefit our youth. pic.twitter.com/CMlM8Tiu6a
క్వాడ్ ఫెలోషిప్, నెక్స్ట్ జనరేషన్ సైంటిస్ట్స్, టెక్నాలజిస్ట్స్ మధ్య సంబంధాలను పెంపొందించడానికి తీసుకొచ్చిన కొత్త గ్రాడ్యుయేట్-లెవెల్ ఫెలోషిప్ అని యూజీసీ తెలిపింది. ఈ సంవత్సరం మొదటి బ్యాచ్‌ను రిక్రూట్ చేస్తోంది. యూజీసీ కమిషన్ ప్రకారం, ఈ కార్యక్రమం 100 ప్రతిభావంతులైన అమెరికన్, జపనీస్, ఆస్ట్రేలియన్, భారతీయ మాస్టర్స్, డాక్టరల్ విద్యార్థులను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ (STEM)లో యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవడానికి స్పాన్సర్ చేస్తుంది. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం యూజీసీ నుంచి ఎటువంటి ఆర్థిక బాధ్యత ఉండదని అధికారిక నోటిఫికేషన్లో కమిషన్ తెలియజేసింది.
ఈ ఫెలోషిప్ క్వాడ్ దేశాలలో ప్రైవేట్, పబ్లిక్, విద్యా రంగాలలో ఇన్నోవేషన్స్ తీసుకురావడానికి, సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్న సైన్స్, టెక్నాలజీ నిపుణుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది. దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ లేదా యునైటెడ్ స్టేట్స్లో పౌరులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసులుగా ఉండాలి. ఆగస్టు 2023 నాటికి స్టెమ్ ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీ ఉండటం తప్పనిసరి. మరిన్ని వివరాలకు మీరు అధికారిక వెబ్సైట్ quadfellowship.orgని విజిట్ చేయవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.