Home /News /jobs /

INTERNSHIPS WANT TO JOIN AN INTERNSHIP PROGRAM THESE ARE THE PART TIME INTERNSHIPS THAT OFFER GOOD OPPORTUNITIES GH VB

Internships: ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరాలనుకుంటున్నారా..? మంచి అవకాశాలు కల్పిస్తున్న పార్ట్‌టైమ్ ఇంటర్న్‌షిప్స్ ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆఫీస్‌లో వర్క్ ఏవిధంగా ఉంటుందో విద్యార్థులు తెలుసుకోవడం కోసం వివిధ కాలేజీలు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను చేపడుతుంటాయి. సంబంధిత రంగాల్లో అనుభవం కోసం అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుంది.

ఆఫీస్‌లో వర్క్(Office Work) ఏవిధంగా ఉంటుందో విద్యార్థులు(Students) తెలుసుకోవడం కోసం వివిధ కాలేజీలు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను(Internship Programmes) చేపడుతుంటాయి. సంబంధిత రంగాల్లో అనుభవం కోసం అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో(Future) ఈ రకమైన ఉపాధి‌ని కొనసాగించాలా? లేక మరో రంగంలోకి ప్రవేశించాలా? అనే నిర్ణయం తీసుకోవడానికి ఇంటర్న్‌షిప్(Internship) సహాయపడుతుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులకు యాజమాన్యాలు స్టైఫండ్‌ను కూడా అదిస్తాయి. హ్యుమానిటీస్ విద్యార్థుల కోసం పార్ట్-టర్మ్ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్ జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆర్చీస్ లైఫ్‌స్టైల్‌ ఫోటోగ్రఫీ ఇంటర్న్‌షిప్
ఈ ప్రోగ్రామ్ మూడు నెలల పాటు జరగనుంది. సంస్థ ఆఫీస్ ఢిల్లీలో ఉన్నందున అక్కడి నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఆర్చీస్ లైఫ్‌స్టైల్‌ ఫోటోగ్రఫీ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 5గా నిర్ణయించారు. వర్క్ ఎక్స్‌ఫీరియన్స్‌తో పాటు నెలకు రూ. 15వేల స్టైఫండ్ కూడా లభిస్తుంది.

* క్యాసియో ఇండియా క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఒక నెల పాటు వర్క్-ఎట్- హోమ్ విధానంలో జరుగుతుంది. వ్యాపార విశ్లేషణలు, వ్యాపార కమ్యూనికేషన్, డిజిటల్ మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకోవడానికి ఈ ఇంటర్న్ షిప్ ఎంతో ఉపయోగపడుతుంది. అభ్యర్థుల పనితీరు ఆధారంగా స్టైఫండ్ లభించనుంది. అభ్యర్థులు మే 5లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Infosys: ఇన్ఫోసిస్ కొత్త రూల్‌.. రిజైన్ చేస్తే.. ఆరు నెల‌ల‌పాటు ఆ కంపెనీల్లో చేరొద్దని రూల్‌!

* డీప్‌థాట్ ఎడ్యుటెక్ వెంచర్‌లో టీచింగ్‌పై ఇంటర్న్‌షిప్
టీచింగ్ ఫీల్డ్‌‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ ఇంటర్న్‌షిప్ అద్భుత అవకాశం లాంటిది. ఇంటి నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అభ్యర్థులు నెలకు రూ.2000 నుంచి 4000 వరకు స్టైఫండ్ లభిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ కోసం అభ్యర్థులు మే 2లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* కుందుజ్ ఇన్‌కార్పొరేషన్‌లో సబ్జెక్ట్ మేటర్ ఎక్స్‌పర్ట్ (ఎకనామిక్స్)ఇంటర్న్‌షిప్
ఈ ప్రోగ్రామ్ మూడు నెలల పాటు వర్క్ ఫ్రం హోం విధానంలో జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5000 నుంచి 6000 స్టైఫండ్ లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ కోసం మే నెల ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆమ్ ఆద్మీ పార్టీ కంటెంట్ రైటింగ్ (హిందీ) ఇంటర్న్‌షిప్
ఈ ఇంటర్న్‌షిప్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఫరీదాబాద్, ఢిల్లీ, ఘజియాబాద్, గుర్గావ్, నోయిడా వంటి నగరాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మూడు నెలల పాటు జరగనుంది. అయితే ఎటువంటి స్టైఫండ్ ఇవ్వరు. దరఖాస్తు చేసుకోవడానికి మే 2 చివరి తేదీగా నిర్ణయించారు.

Job Mela in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జాబ్‌మేళా.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు.. వాక్ ఇన్ తేదీలు

* టింకా టింకా ఫౌండేషన్‌ ట్రాన్స్‌లేషన్ ఇంటర్న్‌షిప్
రెండు నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు. వర్క్ ఫ్రం హోం విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. ఇంటర్న్‌షిప్ సమయంలో ఎటువంటి స్టైఫండ్ లభించదు. కేవలం వర్క్ ఎక్స్‌ఫీరియన్స్ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 29లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Internship, Interships, Photography

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు