Home /News /jobs /

INTERNSHIPS LOOKING FOR THE BEST MARKETING INTERNSHIP THESE DETAILS ARE FOR YOU GH VB

Internships: బెస్ట్ మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్‌ కోసం చూస్తున్నారా..? అయితే ఈ వివరాలు మీకోసమే..

ప్రతీకాాత్మక చిత్రం

ప్రతీకాాత్మక చిత్రం

ఇంటర్న్‌షిప్‌లు పని వాతావరణంపై అవగాహన పెంచుతాయి. మీరు మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్‌(Marketing Internships)ల కోసం చూస్తుంటే.. ఈ ఆప్షన్‌లను పరిశీలించండి.

ఏదైనా ఉద్యోగం(Job) కోసం వెళ్లినప్పుడు.. సంబంధిత రంగంలో నైపుణ్యం ఉంటే రిక్రూటర్‌కు అభ్యర్థిపై మంచి అభిప్రాయం కలుగుతుంది. ఉద్యోగం(Job) రావడానికి అవకాశాలను పెంచుతుంది. ఏదైనా రంగంలో పని (Work) చేయాలని కోరుకుంటున్నప్పుడు ఆ రంగంలో నైపుణ్యం ఎలా పొందాలనే దానిపై దృష్టి పెట్టాలి. ఇంటర్న్‌షిప్‌లు పని వాతావరణంపై అవగాహన పెంచుతాయి. మీరు మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్‌(Marketing Internships)ల కోసం చూస్తుంటే.. ఈ ఆప్షన్‌లను పరిశీలించండి.

* ఇండియన్ డిఫెన్స్ అకాడమీలో డిజిటల్ మార్కెటింగ్‌లో ఇంటర్న్‌షిప్
డెహ్రాడూన్‌లో పని చేయడానికి అందుబాటులో ఉన్న దరఖాస్తుదారుల కోసం మూడు నెలల ఇంటర్న్‌షిప్ అందుబాటులో ఉంది. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ డెహ్రాడూన్‌లోని ప్రీమియర్ NDA కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి. ఇది ప్రస్తుతం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ 3 నెలల సుదీర్ఘ ఇంటర్న్‌షిప్ సమయంలో కార్పొరేషన్ ప్రతి నెలా రూ.10,000 చెల్లిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షాలాలో జూన్ 4 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

* ఆహా టెక్నోక్రాట్స్ వద్ద మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్
AHA టెక్నోక్రాట్‌లు రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం అర్హులైన వ్యక్తుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కంపెనీ రూ.10,000 నుంచి రూ.25,000 వరకు నెలవారీ స్టైఫండ్‌ను చెల్లిస్తుంది. ఎంపికైన వారు నోయిడాలో పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షాలాలో జూన్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలి.

* UABLE వద్ద మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్
దరఖాస్తుదారులు రెండు నెలల పాటు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000 స్టైఫండ్‌తో పాటు ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉంది. ఇంటర్న్‌షాలాలో జూన్ 3లోగా దరఖాస్తు చేయాలి.

* బైజూస్‌లో మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్
బైజూస్‌లో నాలుగు నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. శిక్షణ ఇవ్వడంతో పాటు నెలవారీగా రూ.15,000 అందిస్తారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు వీలైనంత త్వరగా ఇంటర్న్‌షాలాలో దరఖాస్తు చేసుకోవాలి, మే 25తో గడువు ముగుస్తుంది.

Explained: స్వీడన్‌, ఫిన్‌లాండ్‌ నాటోలో చేరడాన్ని టర్కీ ఎందుకు వ్యతిరేకిస్తోంది..?


* మార్కెటింగ్‌మంకీజ్‌లో వ్యాపార అభివృద్ధి (సేల్స్)లో ఇంటర్న్‌షిప్
ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్. Marketing Monkeyz, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్-అప్, 6 నెలల కాంట్రాక్ట్ కోసం దరఖాస్తుదారులను నియమించుకోవాలని చూస్తోంది. ఎంపికైన వ్యక్తులు రూ.3000 నెలవారీ జీతం అందుకుంటారు. ఇంటర్న్‌షాలాలో జూన్ 3లోపు దరఖాస్తు చేసుకోవాలి.

* DESIGNANDCONSTRUCT.INలో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్
స్టార్టప్ డిజైన్, నిర్మాణ రంగాలలో ఇంటర్న్‌ల కోసం వెతుకుతోంది. మూడు నెలల సర్వీస్ పీరియడ్ కోసం రూ.15,000 స్టైఫండ్ చెల్లిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పనిచేయాలి. Designandconstruct.inకి ఇంటర్న్‌షాలాలో జూన్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలి.

షైన్ కన్సల్టెంట్స్‌లో సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్
సైన్ కన్సల్టెంట్స్‌లో ఇంటర్న్‌షిప్ రెండు నెలల పాటు ఉంటుంది. అభ్యర్థులు ఇంటి నుండి పని చేయడానికి అవకాశం ఉంది. నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్ లభిస్తుంది. జూన్ 4లోగా ఇంటర్న్‌షాలాలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Internship, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు